ఫ్రెంచ్ ప్రజలను చంపే హక్కు ముస్లింలకు ఉంది : మలేషియా మాజీ ప్రధాని

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Twitter Deletes Ex-Malaysian PM’s Tweet For Glorifying Attack In France ఫ్రాన్స్‌ లోని నీస్ న‌గ‌రంలోని ఓ చర్చి వద్ద గురువారం అల్లాహ్ అక్బర్ అని బిగ్గరగా అరుస్తూ ఓ ఆగంతకుడు క‌త్తితో దాడికి పాల్పడిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇది ఉగ్రవాద చర్యేనని ఫ్రాన్స్ ప్రకటించింది. కాగా, నీస్ ప‌ట్ల ప్ర‌పంచ దేశాలు సంఘీభావం ప్ర‌క‌టిస్తున్నాయి. భారత్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదంపై పోరులో ఫ్రాన్స్ కు భారత్ అండగా ఉంటుందని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు.కాగా,ఇప్పుడు మ‌లేషియా మాజీ ప్ర‌ధాని మ‌హ‌తిర్ మొహ‌మ్మ‌ద్ మాత్రం ఫ్రాన్స్ ఉగ్రదాడిని సమర్థించారు. మిలియ‌న్ల సంఖ్య‌లో ఫ్రెంచ్ ప్ర‌జ‌ల్ని చంపే హ‌క్కు ముస్లింల‌కు ఉన్న‌ట్లు మ‌హ‌తిర్ గురువారం వివాదాస్పద ట్వీట్ లు చేశారు. అన్నారు. ఫ్రాన్స్‌లో ఇటీవ‌ల మహమ్మద్‌ ప్రవక్త వివాదాస్పద కార్టూన్లను విద్యార్ధులకు చూపిస్తున్నారంటూ సామ్యుల్ పాటీ అనే టీచ‌ర్‌ ను ఓ ముస్లిం యువకుడు దారుణంగా చంపేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రస్తావించిన మతిహర్.. ముస్లిం యువకుడు టీచర్ తల నరకడాన్ని తాను సమర్థించనని అన్నారు.ఇతరులను కించపరచడం భావ ప్రకటనా స్వేచ్ఛ పరిధిలోకి రాదని కూడా మతిహర్ పేర్కొన్నారు. ఆగ్రహంతో ఉన్నవారు మనుషుల ప్రాణాలు తీస్తారని, దానికి మతంతో పనిలేదని వ్యాఖ్యానించారు. ఫ్రెంచ్ చరిత్రలో ఎంతో మందిని చంపిన దాఖలాలున్నాయని… హత్యకు గురైనవారిలో అత్యధికులు ముస్లింలేనని గుర్తుచేశారు. కాబట్టి ఫ్రాన్స్‌లో లక్షలాది మందిని చంపే హక్కు ముస్లింలకు ఉందని మతిహర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇత‌రుల‌ను గౌర‌వించే వ్య‌క్తిత్వాన్ని ఫ్రెంచ్ ప్ర‌జ‌లు నేర్చుకోవాల‌ని మలేషియా మాజీ ప్ర‌ధాని తెలిపారు. ఫ్రాన్స్ అధ్య‌క్షుడి వైఖ‌రిని ఖండించిన మ‌హ‌తిర్‌.. ఆయ‌న నాగ‌రికుడిలా వ్య‌వ‌హ‌రించ‌లేద‌న్నారు. ఓ వ్య‌క్తి త‌ప్పు చేస్తే, మీరు యావ‌త్ ముస్లింల‌ను నిందించార‌ని పేర్కొన్నారు.కాగా, మహతిర్ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ డిజిటల్ సెక్టార్ మంత్రి సెడ్రిక్ వెంటనే స్పందించారు. ట్విట్టర్ ఫ్రాన్స్ ఎండీతో నేరుగా ఫోన్ లో మాట్లాడి మహతీర్ ట్వీట్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో మతిహర్ వివాదాస్పద ట్వీట్లను ట్విట్టర్ తొలగించింది.

Related Tags :

Related Posts :