ట్రంప్ ట్వీట్‌కు మళ్లీ కాపీరైట్.. తొలగించేసిన ట్విట్టర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రెసిడెంట్ ట్రంప్ పెట్టిన ప్రచారాత్మక వీడియోను ట్విట్టర్ డిజేబుల్ చేసింది. కాపీరైట్ కంప్లైంట్ కింద బ్లాక్ చేస్తున్నట్లుగా పేర్కొంది. లింకిన్ పార్క్ గ్రూప్ నుంచి మ్యూజిక్ తో కూడిన వీడియోను పోస్టు చేయగా శనివారం సాయంత్రానికి కనిపించకుండాపోయింది. ఓ నోటిఫికేషన్ లో కాపీరైట్ వల్ల తీసేసినట్లు ట్విట్టర్ చెప్పింది. ‘కాపీరైట్ ఓనర్ రిపోర్ట్ ఫలితంగా మీడియాను డిజేబుల్ చేశామనేదే నోటిఫికేషన్ లో ఉన్న మెసేజ్’

వైట్ హౌజ్ సోషల్ మీడియా డైరక్టర్ డాన్ స్వావినో చేసిన్ ట్వీట్‌ను ట్రంప్ రీట్వీట్ చేశారు. దీనికి మెషీన్ షాప్ ఎంటర్‌టైన్మెంట్.. డిజిటల్ మిలీనియం కాపీరైట్ యాక్ట్ కింద నోటీస్ ఇచ్చింది. ‘వ్యాలిడ్ కాపీరైట్ కంప్లైంట్ కు రెస్పాండ్ అవుతూ ఈ నోటీస్ పంపాం’ అని ట్విట్టర్ ప్రతినిధి ఈమెయిల్ లో వెల్లడించారు. బ్లాక్ చేయడానికి ముందు పంపిన కామెంట్ కు వైట్ హౌజ్ వెంటనే స్పందించలేదు.

మే నెల నుంచి ట్విట్టర్ ట్రంప్ ట్వీట్లను ఛాలెంజ్ చేయడం మొదలుపెట్టింది. సోషల్ మీడియా కంపెనీ పలుమార్లు ట్వీట్లను డిజేబుల్ చేయడం, లేదా ప్రెసిడెంట్ ట్వీట్లకు కామెంట్లు చేయడం వంటివి చేసింది. కాపీరైట్ కంప్లైంట్స్, పాలసీ అతిక్రమించిన వాటికి వెంటనే రెస్పాండ్ అవుతూ వచ్చింది.

జూన్ 30న పెట్టిన ఇమేజ్ ను కూడా ట్విట్టర్ తీసేసింది. ట్రంప్ తన ఫొటోనే పెట్టుకున్నప్పటికీ అది తీసింది న్యూయార్క్ టైమ్స్ ఫొటోగ్రాఫర్ అని కాపీరైట్ ఇష్యూ రైజ్ చేశాడు. మే నెలలోనూ ట్రంప్ కు వార్నింగ్ లేబుల్ తో ప్రెసిడెంట్ కు ట్వీట్ చేసింది ట్విట్టర్.

Related Posts