లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

ట్రంప్ ఒప్పుకోకున్నా జనవరి-20న బైడెన్ చేతికి…అధికార బదిలీకి ఏర్పాట్లు పూర్తి

Published

on

Twitter to Handover @POTUS Account to Joe Biden ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరిలో అధ్యక్ష అధికార బదిలీకి అవసరమైన చట్టబద్ధ ఏర్పాట్లన్నింటినీ ట్రంప్‌ ప్రభుత్వం పూర్తి చేసిందని వైట్‌ హౌస్‌ వర్గాలు తెలిపాయి. కాగా, ఎన్నికల్లో జో బైడెన్‌ గెలుపును గుర్తించేందుకు ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ నిరాకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్‌ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.శనివారం వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ ‌మెకెనీ మాట్లాడుతూ.. పోలైన ప్రతి లీగల్‌ ఓటును లెక్కించాలన్నదే ట్రంప్‌ అభిమతమన్నారు. ఓటింగ్‌లో మోసాలు జరిగినట్లు నిజమైన ఆరోపణలున్నాయని చెప్పారు, కానీ ఇందుకు తగు ఆధారాలను చూపలేదు. ఇదే సమయంలో అధికార బదిలీకి అవసరమైన ఏర్పాట్లను వైట్‌ హౌస్‌ చేసిందని తెలిపారు. జనవరి 20న బైడెన్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సిఉంది. మరోవైపు అనేక కోర్టుల్లో ఎదురు దెబ్బలు తగులుతున్న నేపథ్యంలో తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలపై ట్రంప్‌ ఆశ పెట్టుకున్నట్లు మీడియా అంచనా వేస్తోంది. ఆయా రాష్ట్రాల గవర్నర్లు తననే విజేతగా ప్రకటిస్తారని ట్రంప్‌ ఆశిస్తున్నారని తెలిపింది.ట్రంప్‌ ఆమోద ముద్ర లేకపోవడంతో అధికార బదిలికీ అవసర ఏర్పాట్లను జీఎస్‌ఏ ఇంతవరకు చేపట్టలేదు. ఇందుకు అవసరమైన 90 లక్షల డాలర్ల నిధులు కూడా విడుదల కాలేదు. ఇప్పటివరకు జీఎస్‌ఏ అధిపతి ఎమిలీ మర్ఫీ బైడెన్‌ గెలుపును గుర్తించలేదు. ఈ నేపథ్యంలో జీఎస్‌ఏ తగు సమయంలో స్పందిస్తుందని, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియ జరుగుతోందని మెకెనీ చెప్పారు. మరోవైపు డిసెంబర్‌ 14న ఎలక్టోరల్‌ కాలేజీ సమావేశాన్ని ప్రభావితం చేసేలా ట్రంప్‌ యత్నిస్తున్నారని డెమొక్రాట్లు విమర్శిస్తున్నారు. విస్కాన్సి న్‌లోని రెండు కౌంటీల్లో జరుగుతున్న రీకౌంటింగ్‌లో అక్రమ బ్యాలెట్లను లెక్కిస్తున్నారని ట్రంప్‌ అభ్యంతరాలు చెబుతున్నారు.మరోవైపు, అమెరికా అధ్యక్షుడి అధికారిక ఖాతా @POTUS ను జనవరి 20న బైడెన్‌ చేతికి అప్పగిస్తామని ట్విటర్‌ ప్రకటించింది. అప్పటికి ట్రంప్‌ తన ఓటమిని ఒప్పుకోకున్నా అధికారిక అకౌంట్‌ను బైడెన్‌కు అందిస్తామని తెలిపింది. ట్రంప్‌నకు ఈ అకౌంట్‌తో పాటు విడిగా @realDonaldTrump పేరిట మరో ఖాతా ఉంది. పోటస్‌ఖాతాను బైడెన్‌కు అప్పగించాక, ఇప్పటివరకు అందులో ఉన్న ట్వీట్లు అర్కైవ్స్‌లోకి వెళతాయని ట్విటర్ తెలిపింది. దీంతో పాటు @whitehouse, @VP, @FLOTUS లాంటి పలు అధికారిక ఖాతాలు సైతం జనవరి 20న చేతులు మారతాయని ట్విటర్‌ తెలిపింది. పోటస్‌ ఖాతాకు ప్రస్తుతం 3.2 లక్షల మంది ఫాలోయర్లున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *