తల్లి మాజీ భర్తను కొట్టి చంపిన కొడుకులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Crime News పంజాబ్ లోని లూధియానాకు చెందిన ఇద్దరు సోదరులు తమ తల్లి మాజీ భర్తను కొట్టి చంపారు. వారి అభీష్టానికి విరుధ్దంగా కలిసి జీవిస్తున్నారనే కోపంతో కొడుకులు ఈఘాతకానికి ఒడిగట్టారు. లూధియానాకు చెందిన గుర్మెల్ సింగ్ (57), షిందర్ కౌర్ లు 35 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. ఆరోజుల్లో ఇద్దరి మధ్య అభిప్రాయ భేధాలు రావటంతో విడిపోయారు. గుర్మెల్ తల్వారా గ్రామంలో పూజారిగా పని చేస్తున్నాడు.

కాగా గుర్మెల్ నుంచి విడిపోయిన తర్వాత షిందర్ కౌర్ మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు జస్పీత్, జస్దీప్ పుట్టారు. ఇటీవల 3 సంవత్సరాల క్రితం షిందర్ కౌర్ భర్త మరణించాడు. ఆ సమయంలో మళ్లీ గుర్మెల్ సింగ్ షిందర్ కౌర్ తో పరిచయం పెంచుకున్నాడు. మళ్లీ వారిద్జరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో వారిద్దరు కలిసి జీవించాలనుకున్నారు.ఒంటరిగా ఉన్న షిందర్ కౌర్ తో కలిసి గుర్మెల్ సింగ్ కాపురం పెట్టాడు. వీరిద్దరు కలిసి జీవించటం జస్పీత్, జస్దీప్ కు నచ్చలేదు. తల్లికి ఆవిషయం చెప్పారు. అయినా ఒకప్పటి భార్యా భర్తలైన గుర్మెల్, షిందర్ కలిసే జీవించటం మొదలెట్టారు. దీంతో అన్నదమ్ములు కోపంతో రగిలిపోయారు.ఇటీవల ఒకరోజు గుర్మెల్ నిద్రుపోతున్నసమయంలో ఇంట్లోకి ప్రవేశించి కర్రలతో విపరీతంగా కొట్టి పారిపోయారు. తీవ్ర గాయాలైన గుర్మెల్ ను చండీఘడ్ లోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రాణాలు విడిచాడు. నిందితులిద్దరిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్ననిందితులకోసం గాలింపు చేపట్టారు.

 

 

Related Posts