లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

పెళ్లి చేసుకున్న ‘ఇద్దరమ్మాయిలు’..

Published

on

ఎక్కడైనా అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటారు.కానీ యూపీలో ఇద్దరు అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది అక్కడ. అంతేమరి ఇది డిఫరెంట్ కదా..అదికాస్తా పోలీసు స్టేషన్ కు చేరింది. దీంతో మమ్మల్ని విడదీయొద్దు అంటూ ఆ ఇద్దరమ్మాయిలు పోలీసుల్ని వేడుకుంటున్నారు.వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇద్దరు అమ్మాయిలు దేవుడి సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నవీరిద్దరూ పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్నారు. దీనికి పెద్దలు అభ్యంతరం చెప్పారు. మీకిదేం పోయేకాలం..ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవటం ఎక్కడన్నా ఉందా..మా పరువు తీయకండే తల్లుల్లారా..అంటూ వారి పెద్దలు నెత్తీ నోరూ కొట్టుకున్నారు. ప్రేమ పెళ్లిళ్లనే చాలామంది పెద్దలు ఒప్పుకోని ఈ రోజుల్లో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకోకపోవటం సర్వ సాధరణమే. కానీ ఆ అమ్మాయిలు పెద్దల మాట వినలేదు..గుడిలో దేవుడి సాక్షిగా పెళ్లి చేసేసుకున్నారు.దీంతో ఈ పంచాయితీ కాస్తా పోలీస్ స్టేషన్ చేరుకుంది.

కాన్పూర్‌కు చెందిన ఏక్తా అనే యువతి..అయోధ్యకు చెందిన వర్ష అనే యువతి ఇద్దరు బంధువులు. కాస్త దూరపు చుట్టరికం. ఏక్తా తరచూ కాన్పూర్ కు వచ్చి వర్షను కలిసేది. చుట్టరికం ఉండటం..పైగా అమ్మాయి కూడా కావటంతో ఇబ్బంది లేదు..అలా అస్తమాను ఏక్తా వర్షను చూడటానికి వచ్చేది..అలా ఇద్దరి మనసూ మనసూ కలిశాయి. చాలా దూరం వెళ్లారు.వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పెద్దలు మందలించారు. పిచ్చి పిచ్చి వేషాలేస్తే కాళ్లు విరక్కొట్టేస్తాం అని బెదిరించారు. అయినా అమ్మాయిలు ఏమాతరం తగ్గలేదు. మేమిద్దం ప్రేమించుకుంటున్నామని చెప్పేశారు. దీంతో పెద్ద అగ్నిపర్వతం బద్దలైనట్లుగా షాక్ అయ్యారు పెద్దలు..పిచ్చపిచ్చగా ఉందా..పెళ్లీ గిళ్లీ అంటే చంపి పాతరేస్తామని హెచ్చరించారు.

కాలేజ్ మెరిట్ లిస్ట్‌లో తన పేరు చూసి ఫన్నీ ట్వీట్ చేసిన సన్నీ..


ఇక పెద్దలను ఒప్పించడం కష్టమని అనుకున్నారు.విడివిడిగా బతకడం కూడా కష్టమని వర్ష ఓ శుభముహూర్తం చూసుకుని కాన్పూర్ వెళ్లింది. ఆగస్టు 26న తపస్వీ మందిర్‌లో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసేసుకున్నారు. దీంత అనుకున్నట్లుగానే కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎంతకు తెగించాలరే..మీపని చెబుతాం ఉండండీ అంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అది విన్న పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఇదికూడా కామనే..కానీ..ఇద్దరూ మేజర్లే కనుక తామేమీ చెయ్యలేమని చెప్పారు. కానీ పెద్దవాళ్ల గురించి కూడా ఆలోచించమని ఇద్దరమ్మాయిలకు సూచించారు కౌన్సెలింగ్ ద్వారా. కానీ మేం విడిగా బతకలేం అని తెగేసి చెప్పేసరికి పోలీసులు కూడా చేతులెత్తేసి వాళ్లిద్దరూ మేజర్లు మేం ఇక ఏమీ చేయలేం అని చెప్పారు. దీంతో పెద్దవాళ్లు కూడా ఏమీ చేయలేక చచ్చినట్లుగా ఒప్పుకోవాల్సి వచ్చింది. కొసమెరుపేమంటే ఇద్దరు యువతుల్లో ఒకరు భర్తగా మసలుకుంటూ కొత్తకాపురం పెట్టేశారు. వారి కాపురం..వారి సరసాలు చూసినవారంతా ‘పిదపకాలం పిదపబుద్దులు…అని కొంతమంది బుగ్గలు నొక్కుకుంటుంటే..మరికొందరు కలికాలం ఈరోజుల్లో పిల్లలకు ఏం చెప్పలేకపోతున్నాం బాబూ..ఇదే మా కాలంలో అయితేనా..అంటూ ముక్కుమీద వేలేసుకుంటున్నారు. కానీ ఇవేవీ పట్టని ఆ ‘ఇద్దరు అమ్మాయిలు’సక్కగా సరసాల్లో తేలిపోతున్నారు…!!!

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *