regin

కాంగ్రెస్ కు మాజీ ఎమ్మెల్యే, శేరిలింగంపల్లి ఇంఛార్జీ రాజీనామా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Two Congress leaders resign : జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కు షాక్ తగిలింది. హైదరాబాద్ లో ఇద్దరు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. హైదరాబాద్ శేరిలింగంపల్లి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంఛార్జీ రవి కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. గత కొద్ది రోజులుగా అసంతృప్తితో రగిలిపోతున్న ఈ ఇద్దరు నేతలు తాజాగా బీజేపీలో చేరే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ఇద్దరు నేతల రాజీనామాతో శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ కు బలమైన నేతలు దూరమయ్యారు.ఇవాళ పార్లమెంట్ స్థాయి కమిటీలు సమావేశమై అభ్యర్థులపైన వడపోత కార్యక్రమం చేయాలని ముఖ్యనేతలు ఆలోచిస్తున్న నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న బలమైన నేతలంతా కూడా పార్టీని విడిచిపెట్టేందుకు రంగం సిద్ధమవుతుడం ఆ పార్టీ నేతలను కలవరపెడుతోంది.శేరిలింగంపల్లిలో భిక్షపతి యాదవ్, రవి కుమార్ బలమైన నేతలుగా చెప్పవచ్చు. భిక్షపతి యాదవ్ గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఇద్దరు కూడా పార్టీకి రాజీనామా చేసినట్లు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ కాల్ ద్వారా సమాచారం అందించారు. పార్టీలో ఉండాలని, సముచిత స్థానం కల్పిస్తామని ఉత్తమ్ కుమార్ వారికి తెలిపారు. కాసేపటి క్రితమే భిక్షపతి యాదవ్ తో ఉత్తమ్ భేటీ అయ్యారు. ఆయన్ను బుజ్జగించి పార్టీలోనే ఉంచాలని ప్రయత్నాలు చేస్తున్నారు.


హైదరాబాద్‌ మీ సేవ కేంద్రాల దగ్గర బారులు తీరిన వరద బాధితులు…ఉదయం 5 గంటల నుంచే పడిగాపులు


మరోవైపు గ్రేటర్ అధ్యక్షుడిగా ఉన్న అంజన్ కుమార్ యాదవ్ కూడా పార్టీ అధినేతల పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పరిధిలో ఉన్న ప్రతి పార్లమెంట్ కు సంబంధించి కమిటీలు వేశారని..తనను సంప్రదించకుండానే కమిటీలు వేశారని అసంతృప్తిగా ఉన్నారని కనిపిస్తోంది.తన కుమారుడు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అనిల్ కుమార్ పార్టీకి హైదరాబాద్ లో గట్టి సేవలు అందిస్తున్నా నేతలు చాలా నిర్లక్ష్యం చేసినట్లు తెలిపారు. ఏ కమిటీలో కూడా తనకు స్థానం కల్పించలేదని.. తన కుమారుడికి స్థానం కల్పించకపోవడం చాలా అవమానకరమన్నారు.

Related Tags :

Related Posts :