Two leopard skins recovered from an individual in Chowari, Himachal Pradesh

చిరుతపులుల చర్మాలు స్వాధీనం : వ్యక్తి అరెస్ట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వేటగాళ్లబారికి ఎన్నో వన్యమృగాలు బలైపోతున్నాయి. అటవీ చట్టాల ప్రకారం అధికారులు ఎన్ని పట్టిష్టమైన ఏర్పాట్లు చేసినా వేటగాళ్లకు బలైపోతునే ఉన్నాయి. ఈ క్రమంలో రెండు చిరుత పులి చర్మాలను తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రెండు చిరుత పులి చర్మాలను స్వాధీనం చేసుకున్నారు. 

ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని చొవరి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి వద్ద పోలీసులు ఈ చిరుతపులుల చర్మాలను గుర్తించారు. పులిచర్మాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అటవీ, జంతు సంరక్షణ చట్టాల కింద కేసు నమోదు చేశారు.

Related Posts