రెండు నెలల బాబుకు, తల్లికి కరోనా.. పట్టించుకోని గుంటూరు జీజీహెచ్ వైద్య సిబ్బంది

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

గుంటూరు జీజీహెచ్ లో దారుణం జరిగింది. కరోనా బాధితుల పట్ల అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు వస్తున్నాయి. రెండు నెలల బాబుకు, తల్లికి కరోనా సోకింది. దీంతో మూడు రోజుల క్రితం వారు జీజీహెచ్ లో చేరారు. అప్పటినుంచి తమను వైద్యులు, సిబ్బంది పట్టించుకోవడం లేదంటే బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. కనీసం ఇంజక్షన్ కూడా చేయడం లేదని సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు అడిగినా ఇంజెక్షన్ చేయడం లేదని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

తాడేపల్లి మండలానికి చెందిన కిరణ్ గీతకు కరోనా వ్యాధి సోకింది. మూడు రోజుల క్రితం గుంటూరు జీజీహెచ్ లో చేరారు. ఆమె ద్వారా బిడ్డకు కూడా కరోనా సోకింది. బిడ్డకు కొంత యూరిన్ ఇన్ ఫెక్షన్ రావడంతో సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. ఉదయం సూపరింటెండెంట్, ఆర్ఓవోను కలిసి బాబుకు ఇంజెక్షన్ చేయాలని కోరారు. జీజీహెచ్ లో వైద్యులు కొరత, మరోవైపు 50 మంది డాక్టర్లకు కూడా కరోనా సోకింది. మిగిలిన వైద్య సిబ్బంది మాత్రమే వైద్యం చేస్తున్నారు. సూపరింటెండెంట్ మాట్లాడుతూ ప్రతిసారి ఇంజెక్షన్స్ చేస్తున్నామని చెబుతున్నారు. కొన్న ఇంజెక్షన్ ను కూడా లోడ్ చేయలేదు. ఉన్న ఒక్క డాక్టర్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

కిరణ్ గీతా.. కరోనా పేషెంట్
‘బాబుకు 56 రోజలు.. బాబుకు, తనకు కరోనా వచ్చింది. డాక్టర్లు పిల్లాడిని పట్టించుకోవడం లేదు. అడుగుతుంటే మాకు తెలియదు. మాకు సంబంధం లేదంటున్నారు. ఇంజెక్షన్లు లోడ్ చేసి వదిలేసి వెళ్లిపోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా మూడు డోస్ లు అని చెప్పి ఒక్క డోస్ కూడా పిల్లవాడికి ఇవ్వకుండా సెలైన్ వేసి వెళ్లి పోయారు. పిల్లాడి ఏమీ బాగోలేదు. ఊపిరితిత్తుల్లో నీరు పట్టిందని చెప్పారు. యూరిన్ కు ఇన్ ఫెక్షన్ ఉందని చెప్పారు. ఆ ఇన్ ఫెక్షన్ కు మూడు పూటల మెడిసిన్ ఇవ్వాలని చెప్పారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు’.

‘బాబు ఉదయం నుంచి ఏడుస్తున్నాడు. కనీసం పట్టించుకోవడం లేదు. నిన్న కూడా ఆర్ఎంవో కు కంప్లైట్ ఇచ్చాము. ఈ రోజు కూడా కంప్లైట్ ఇచ్చాము. కానీ వారు రావడం లేదు. సిస్టర్స్ అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు. మే 31 న పుట్టాడు. ఇప్పటివరకు కూడా పిల్లాడికి ఇంజెక్షన్ ఇవ్వలేదు. 24న జాయిన్ అయ్యాము. మాకు ట్రీమ్ టెంబ్ ఇవ్వడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Related Posts