లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

ఏపీ వైపు దూసుకొస్తున్న మరో రెండు తుపాన్లు

Published

on

AP Two more hurricanes : ఆంధ్రప్రదేశ్‌ను ఇప్పట్లో వానలు వీడేలా లేవు. నివార్ తుపాను నుంచి ఇంకా కోలుకోని ఏపీ నెత్తిన మరోసారి పిడుగులాంటి వార్త వేసింది వాతావరణ శాఖ. రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉందని తేల్చి చెప్పింది. రెండు తుపాన్లు ఏపీ వైపు దూసుకొస్తున్నాయయని తెలిపింది. దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి.. రాష్ట్రంపై విరుచుకుపడుతుందని తెలిపింది.దీని ప్రభావంతో మరో రెండు రోజులు తమిళనాడు, పుదుచ్చేరిలోని కరైకల్‌లో అతి భారీ వర్షాలు, ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం వాతావరణశాఖ పేర్కొంది. ఇప్పటికే రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా ప్రాంతాల్లో చాలాచోట్ల ఆదివారం భారీవర్షం కురిసింది.


ప్రాణం తీసిన పబ్జీ గేమ్…అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న డిగ్రీ స్టూడెంట్‌


ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం వద్ద కేంద్రీకృతమైన ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. తొలుత వాయుగుండంగా మారే ఈ అల్పపీడనం తరువాత 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి పశ్చిమ వాయవ్యదిశగా పయనిస్తూ ఇవాళ దక్షిణ తమిళనాడు తీరాన్ని చేరే అవకాశం ఉందని వెల్లడించింది.మరోవైపు ఇప్పటికే నివర్‌ తుపాను ఏపీలోని అనేక జిల్లాల ప్రజలు, రైతులను తీవ్రంగా నష్టపరిచింది. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో పలు చెరువులు, కుంటలు, రోడ్ల తెగిపోయాయి.

జాతీయ రహదారుల్లో సైతం వంతెనలు తెగిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పంటచేలు చెరువులను తలపిస్తున్నాయి.కోతకొచ్చిన వేలాది హెక్టార్ల వరి పంట నీటమునిగింది. ఇప్పటికే చెరువులు, కుంటలు, నదులు నిండుగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా వర్షాలు పడితే మరింత ప్రమాదమని ప్రజలు భయపడుతున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *