two persons tried to bury baby alive

తాత, బాబాయ్ లే పసికందుని సజీవంగా పాతిపెట్టాలనుకోవడానికి కారణమిదే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. బతికున్న శిశువును పాతిపెట్టేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. నగరంలోని

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. బతికున్న శిశువును పాతిపెట్టేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. నగరంలోని జేబీఎస్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును చంపాలని చూశారని పోలీసులు చెప్పారు. చిన్నారిని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లడంతో అనుమానం వచ్చిన ఓ ఆటో డ్రైవర్‌ తమకు సమాచారం ఇచ్చాడని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 31 గురువారం ఉదయం జేబీఎస్ సమీపంలో ఓ ఆటో డ్రైవర్ ఆటోను ఆపి ఖాళీ ప్రదేశంలో మూత్ర విసర్జనకు వెళ్లాడు. అదే సమయంలో అక్కడ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఒకరి చేతిలో బ్యాగ్‌ లాంటిది ఉండగా.. మరొకరేమో గుంత తవ్వుతున్నారు. డౌట్ వచ్చిన ఆటో డ్రైవర్ కాస్త నిశితంగా పరిశీలించాడు. ఆ వ్యక్తి చేతిలో ఉన్నది బ్యాగ్ కాదు పసికందుని చుట్టి ఉంచిన సంచి అని నిర్ధారించుకున్నాడు. మరి ఆ గుంత ఎందుకు తవ్వుతున్నారు అనే ప్రశ్న అతడిలో మెదిలింది. వెంటనే దగ్గరలోనే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వెంకట రామకృష్ణను కలిసి తను చూసిందంతా చెప్పాడు. కానిస్టేబుల్ అక్కడికి వెళ్లి చూడగా.. ఒకాయన చేతిలో పసిపాప కనిపించింది” అని పోలీసులు వివరించారు.

పోలీసులు వచ్చి ప్రశ్నించడంతో ఆ ఇద్దరు వ్యక్తులు విషయం చెప్పారు. తమది కరీంనగర్ అని.. ఆపరేషన్ ఫెయిల్ కావడంతో తమ మనవరాలు చనిపోయిందని.. ఆర్టీసీ బస్సులో సొంతూరు పోదామంటే.. చనిపోయిన పాపను తీసుకెళ్లనీయడం లేదని.. అందుకే పాపను పూడ్చి పెడదామని భావించి గుంత తవ్వుతున్నామని చెప్పారని పోలీసులు వెల్లడించారు. అయితే వాళ్ల తీరుపై పోలీసులకు అనుమానం పెరిగింది. దీంతో సదరు కానిస్టేబుల్ ఆ వ్యక్తి చేతిలో ఉన్న పాపను చూడగా.. పాప ప్రాణంతో ఉంది.

మూడు రోజుల క్రితమే పుట్టిన పసికందు అని తేలింది. అటు ఇటు కదులుతూ కనిపించింది. దీంతో షాక్ తిన్న కానిస్టేబుల్.. ఆ వ్యక్తులు చెబుతున్నది అబద్దం అని తెలుసుకున్నారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. చిన్నారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ పాపను పూడ్చిపెట్టడానికి ప్రయత్నించిన ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

ఆ వ్యక్తులను పసికందు తాతయ్య, బాబాయిలుగా పోలీసులు గుర్తించారు. జన్యుసంబంధ సమస్యతో పాప పుట్టిందని, అందుకే తాము ఇలా చేయాలని అనుకున్నామని నిందితులు విచారణలో అంగీకరించారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే కడతేర్చాలని చూడటం దారుణం అని స్థానికులు వాపోయారు.

READ  భానుడి భగభగలు : ఖానాపూర్‌లో 44.4 డిగ్రీలు

కరీంనగర్ జిల్లా సంకెపల్లి గ్రామానికి చెందిన రాజు, మానస దంపతులు. అక్టోబర్ 28న కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మానస ఆడ, మగకాని శిశువుకు జన్మనిచ్చింది. జన్యులోపం కారణంగా ఇలా జరిగిందని డాక్టర్లు చెప్పారు. దీంతో పసికందుని నగరంలోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారు. అయితే ప్రాణాలకు భరోసా ఇవ్వలేము అన్నారు. దీంతో సొంత గ్రామానికి వెళ్తామని చెప్పి కుటుంబసభ్యులు శిశువుని తీసుకెళ్లారు. అదే సమయంలో చిన్నారిలో ఎలాంటి చలనం కనిపించలేదు. దీంతో చిన్నారిని పాతిపెట్టాలని తాత తిరుపతి, నాయనమ్మ తిరుపతమ్మ, బాబాయ్ రాజేందర్ , నాన్న రాజు అనుకున్నారు. అలా జేబీఎస్ సమీపంలో పసికందుని పూడ్చి పెట్టేందుకు గుంత తవ్వుతూ దొరికిపోయారని పోలీసులు తెలిపారు.

Related Posts