తండ్రి అస్థికల నిమజ్ఙనానికి వెళ్లి తనయులు మృతి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

విశాఖపట్నం జిల్లాలో విషాదం నెలకొంది. తండ్రి అస్థికలు నిమజ్ఙనం చేయడానికి వెళ్లిన ఇద్దరు తనయులు మృతి చెందారు. ఈ ఘటన రావికమతంలో చోటుచేసుకుంది. ఏపీలోని విశాఖ జిల్లా రావికమతంలోని కళ్యాణపు లోవ జలాశయంలో పడి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు.

బుచ్చయ్యపేటకు చెందిన సూరిశెట్టి మూర్తి, గోపీలు తండ్రి అస్థికలను జలాశయంలో కలపడం కోసం వెళ్లారు. మూర్తి‌ నీటిలోకి దిగి అస్థికలు కలుపుతున్న సమయంలో ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. సోదరుడుని రక్షించే క్రమంలో గోపి కూడా మృతి చెందాడు. కొద్దిసేపటి తర్వాత అన్నదమ్ముల మృతదేహాలు ఒడ్డుకు చేరాయి.

మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Posts