ఇకపై ఒకేసారి రెండు డిగ్రీలు చేయొచ్చు!

UGC allowed Students to complete Two Degrees at once

ఇకపై ఒకేసారి రెండు డిగ్రీలు పొందొచ్చు. దేశంలో విద్యార్థులు ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులు చేసేలా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) అనుమతించనుంది. దీనికి సంబంధించి ప్రతిపాదనను కమిషన్‌ ఆమోదించింది. రెండు డిగ్రీ కోర్సులు చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. దేశంలోని విద్యా సంస్థల్లో విద్యార్థులు ఒకే విద్యా సంవత్సరంలో రెండు డిగ్రీ కోర్సులు పూర్తి చేయవచ్చు. రెండూ ఒకేసారి రెగ్యులర్‌ కోర్సులుగా ఉండేందుకు అనుమతించరు. సాధారణ కళాశాల తరగతులలో రెగ్యులర్‌గా ఒక కోర్సు, మరొకటి ఆన్‌లైన్‌లో దూరవిద్య(OLD) ద్వారా అవకాశం కల్పించనున్నారు. 

కొత్త విధానంలో విద్యార్థులు ఒకే సంస్థ లేదా వేర్వేరు సంస్థల ద్వారా ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులను చదవగలరు. ఈ మేరకు యూజీసీ అనుమతి ఇచ్చిందని ఉన్నత విద్యాశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రెండు డిగ్రీల కోసం వచ్చిన ప్రతిపాదనను ఇటీవల జరిగిన కమిషన్‌ సమావేశంలో ఆమోదించారు. త్వరలో అధికారిక నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారని ఉన్నత విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.

ఏకకాలంలో రెండు డిగ్రీ కోర్సుల ప్రతిపాదనలు 2012లోనే యూజీసీ ముందుకువచ్చింది. రెగ్యులర్‌ విధానం కింద డిగ్రీలో చేసే విద్యార్థి, ఒకే సమయంలో ఓపెన్‌ లేదా డిస్టెన్స్‌ విధానంలో గరిష్టంగా ఒక మరో డిగ్రీ చేయడానికి అనుమతించవచ్చనని కమిటీ  సిఫారసు చేసింది. రెగ్యులర్‌ మోడ్‌లో రెండు డిగ్రీలు ఒకేసారి అనుమతించడానికి వీలుకాదని తెలిపింది. 

Read: ఏపీలో ప్రవేశ పరీక్షల రీ షెడ్యూల్: ఎంసెట్‌.. ఐసెట్‌.. దరఖాస్తు గడువు తేదీలు

మరిన్ని తాజా వార్తలు