Home » 60 దేశాల్లో స్ట్రెయిన్..ప్రపంచవ్యాప్తంగా 47 లక్షల కేసులు : WHO
Published
1 month agoon
UK coronavirus strain detected in at least 60 countries : కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చిందని కాస్త రిలాక్స్ అవుతున్న క్రమంలో కొత్త కరోనా ‘స్ట్రెయిన్’ విరుచుకుపడుతోంది. ప్రపంచాన్ని కొత్త టెన్షన్ పట్టుకొచ్చింది. ప్రస్తుతం కలవరపెడుతున్న స్ట్రెయిన్ భారత్ లో కూడా విస్తరించిన విషయం తెలిసిందే. యూకే నుంచి వచ్చిన కొంతమంది ద్వారా స్ట్రెయిన్ కేసులు నమోదైనట్లుగా తెలసింది.
భారత్,అమెరికాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలను యూకే కరోనా చుట్టేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కొవిడ్ పై బుధవారం (జనవరి20,2021) విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది. గత వారంలోనే 10 దేశాలకు స్ట్రెయిన్ వ్యాపించిందని WHO వెల్లడించింది. దక్షిణాఫ్రికా రకం కరోనా 23 దేశాలకు పాకిందని చెప్పింది.
ప్రపంచవ్యాప్తంగా వారంలో 47 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది. అంతకుముందు వారంతో పోలిస్తే కేసులు 6 శాతం తగ్గాయని వెల్లడించింది. అయితే, మరణాలు మాత్రం పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసింది. రికార్డ్ స్థాయిలో ఒక్క వారంలోనే 93 వేల మంది కరోనాకు బలయ్యారని, అంతకుముందు వారంతో పోలిస్తే అది 9 శాతం అధికమని..మొత్తంగా ప్రపంచమంతటా 9.3 కోట్ల మంది కరోనా బారిన పడగా.. 20 లక్షల మందికి పైగా మరణించారని వెల్లడించింది.
స్కూళ్లు తెరవాలనుకుంటే కరోనా కేసులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని WHO సూచించింది. స్కూల్లో విద్యార్థుల మధ్య ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా అతి తక్కువ మంది విద్యార్థులతో తరగతులు నిర్వహించాలని సూచించింది. విద్యార్థుల తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు పరిస్థితిపై చర్చించాలని..తగిన జాగ్రర్తలు పాటించాలంటూ పలు సూచనలు వెల్లడించింది.
ఏపీలో స్కూళ్లు, కాలేజీలకు 2నెలలు సెలవులు.. నిజం ఏంటంటే..
బెంచీకి ఒక్క విద్యార్థే, స్కూల్స్లో ప్రభుత్వం కొత్త రూల్
ఉద్యోగం చేయాలంటే..హైదరాబాద్ లోనే
కూల్డ్రింక్ ఆర్డరిస్తే యూరిన్ బాటిల్..డెలివరీ సంస్థను ఏకి పారేసిన కష్టమర్
కరోనా కలకలం.. ఒకే స్కూల్లో 229మంది విద్యార్థులకు పాజిటివ్
కరోనా నుంచి కోలుకోకముందే.. భయపెడుతున్న కొత్త రకం వ్యాధి