లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

హాస్పిటల్ లో పుట్టిన శిశువులను చంపేస్తున్న నర్సు..అరెస్ట్

Published

on

Uk England baby death charges Nurse : నర్సింగ్ జాబ్ అంటే ఓర్పు సహనానికి మారుపేరు. అర్థరాత్రి సమయంలో కూడా పేషెంట్లకు సేవ చేసే పరిత్రమైన వృత్తి. కానీ ఓ నర్సు తల్లి కడుపులోంచి ఈలోకంలోకి వచ్చిన పసిగుడ్డుల పాలిట మృత్యుదేవతగా మారిందనీ..పుట్టిన బిడ్డల్ని పుట్టినట్లే చంపేస్తోందనే ఆరోపణలు వచ్చాయి. ఆ నర్సు చేసిన ఘాతుకాలకు ఎనిమిదిమంది పసిగుడ్డులు ప్రాణాలు కోల్పోయారని..మరో‌రో ప‌ది మంది చిన్నారుల ప్రాణాల‌ను తీయ‌డానికి ప్ర‌య‌త్నించిందనే ఆరోపణలతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశాడు.


వివరాల్లోకి వెళితే..యునైటెడ్ కింగ్ డమ్ దేశాల్లో ఒకటైన ఇంగ్లండ్‌లోని నార్త్‌వెస్ట‌ర్న్ ఇంగ్లిష్ సిటీలో ఉన్న కౌంటీ ఆఫ్ చెస్ట్ హాస్పిటల్ లో లూసీ లెట్ బే అనే 30ఏళ్ల మహిళ న‌ర్సు ప‌నిచేస్తోంది. పేరుకు నర్సే గానీ శిశువుల పాలిట మృత్యుదేవతగా మారిందనే అభియోగాలు వచ్చాయి. నవమాసాలు మోసి బిడ్డలను కనటానికి వచ్చిన తల్లులకు కడుపుశోకాన్ని కలిగిస్తోందనీ వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలో హాస్పిటల్ కు పురుడు పోసుకోవటానికి వచ్చిన ఆ మహిళలు తమ బిడ్డలు ఎందుకు చనిపోయారో తెలీక ఆవేదనతో కడుపు శోకంతో తల్లడిల్లిపోయేవారు. నిండు నెలలతో వచ్చిన ఆ స్త్రీలు బిడ్డలను ఎత్తుకుని వెళతామనే వారి ఆశల్ని..ఆకాంక్షల్ని లూసీ లెట్ బే వల్లే తమ బిడ్డలు చనిపోయారని వార్తల్లో రావటంతో తల్లడిల్లిపోయారు. ఆమెను తిట్టుకున్నారు.


హాస్పిటల్ లో అప్పుడే పుట్టిన శిశువులను చంపేస్తోందనే ఆరోపణలు లూసీపై రావటంతో పోలీసులు ఆమెను మంగళవారం (నవంబర్ 10,2020) అరెస్ట్ చేశారు. 2015, జూన్ నుంచి 2016 జూన్ వ‌ర‌కు కౌంటెస్ ఆఫ్‌ చెస్ట‌ర్ ద‌వాఖాన‌లోని నియోన‌ట‌ల్ యూనిట్‌లో ఎనిమి‌ది మంది శిశువుల ప్రాణాలు తీసేసిందని ..మ‌రో ప‌ది మంది శిశువులను చంపటానికి చూసిందని పోలీసులు తెలిపారు. ఆమెను అరెస్ట్ చసిన తరువాత ఆమె ఇంటిలో కూడా పోలీసులు సోదాలు చేశారు. కానీ ఎటువంటి ఆధారాలు లభించలేదు.


అరెస్ట్ చేసిన ఆమెను గురువారం మేజిస్ట్రేట్ ముందు హాజ‌రుప‌రుచ‌నున్నారు. గ‌తంలో 2018, 2019లోకూడా ఇవే ఆరోప‌ణ‌ల‌పై ఆ న‌ర్సును పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆరోప‌ణ‌లు రుజువుకాక‌పోవ‌డంతో ఆమెను విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ క్రమంలో మూడవసారి ఆమెను అరెస్ట్ చేసి విచారించి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు.


కాగా నర్సు లూసీపై వచ్చిన ఈ ఆరోపణలపై హాస్పిటల్ యాజమాన్యం ఖండిస్తోంది. చనిపోయిన బిడ్డలంతా ఊపిరితిత్తుల సమస్యలతో పుట్టారని శ్వాస ఆడకచనిపోయారని చెబుతోంది. 2011 నుంచి ఆమె అదే హాస్పిటల్లో నర్స్ గా పనిచేస్తోందనీ వృత్తిపట్ల ఆమెకు అంకితభావంకలిగిన మహిళ అని తెలిపింది.కానీ పోలీసులు మాత్రం ఆమెపై వచ్చిన అభియోగాల విషయంలో సీరియస్ గా దర్యాప్తు చేయిస్తున్నారు. డిటెక్టివ్ చీఫ్ ఆన్స్పెక్టర్ పాల్ హ్యూస్ దర్యాప్తును కూలకషంగా కొనసాగిస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *