లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

చావైనా నేను పిలిస్తేనే వస్తది : హిట్లర్ నుంచి కరోనా వరకూ..మృత్యువుని ఓడించిన 100 ఏళ్ల యోధురాలు..

Published

on

Uk : England old grandmother 100th birthday : చావు. ఈ మాట వింటనే వెన్నులో వణుకు పుడుతుంది. కానీ ఎన్నోసార్లు చావు అంచులదాకా వెళ్లి చావు వికటాట్టహాసం చూసి వచ్చిన మృత్యుంజయురాలిగా నిలిచింది ఓ బామ్మ. చావుకే సవాలు విసిరిన ఆమె 100వ పుట్టిన రోజును సంబరంగా జరుపుకుంది. ఆ చావుకే చావు దెబ్బ తినిపించిన ఆ యోధునాలు గ్రేట్ బ్రిటన్ లోని ఇంగ్లండ్ కు చెందిన ‘జాయ్ ఆండ్రూ’.కోవిడ్ రోగులకు చికిత్స, మారిపోయిన నర్సు ముఖం..ఫొటో వైరల్


‘నా చావైనా నేను పిలిస్తేనే వస్తుంది..లేదు పోవే అంటే పోతుంది అన్నట్లుగా ఉంది జాయ్ ఆండ్రూ చావుతో పోరాడిన విధానం గురించి తెలుసుకుంటే. ఆనాటి హిట్లర్ కాలం నుంచి నేటి కరోనా మహమ్మారి వరకు ఆమె చావుతో పోరాడిన విధానం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.ఎన్నో సార్లు చావు ఆమెను తీసుకుపోవటానికి వచ్చినా..చావుకే చావు దెబ్బ రుచి చూపిన మృత్యుంజయురాలు జాయ్ ఆండ్రూ. అలా ఎన్నోసార్లు చావు అంచులదాకా వెళ్లి గత ఆదివారం (నవంబర్ 22,2020)న తన 100వ పుట్టినరోజును దిగ్విజయంగా జరుపుకుంది ఈ మిరాకిల్ మహిళ జాయ్ ఆండ్రూ.బ్రిటన్‌కు చెందిన జాయ్ ఆండ్రూ ఎన్నో సార్లు చావు అంచుల వరకు వెల్లి తిరిగి వచ్చారామె. ఒకప్పటి నాజీ నియంత హిట్లర్ ఆమెను చంపించేందుకు చూశాడట. హిట్లర్ దెబ్బనుంచి తప్పించుకున్నవారు చాలా తక్కువ. కానీ ఆండ్రూ మాత్రం తప్పించుకుంది. మరికొన్నేళ్లకు అత్యంత ప్రమాదకరమైన విమాన ప్రమాదంలో చిక్కుకుంది. ఆ ప్రమాదంలో ఎంతోమంది మరణించారు. కానీ ఆండ్రూ బతికి బయటపడింది.అలా మరోసారి చావు ఆమె పక్కనే నిల్చుంది. ఈసారి నీకు రొమ్ము క్యాన్సర్ ని ఇచ్చాను..ఇక నువ్వు నానుంచి తప్పించుకోలేవు..అంటూ పలకరించింది. కానీ మనోథైర్యంతో రొమ్ము క్యాన్సర్ ని కూడా జయించి మరోసారి చావుకు చావుదెబ్బను రుచి చూపించింది.అలా ఈ కరోనా కాలంలో కూడా మరోసారి ఆమె మృత్యుంజయురాలిగా నిలిచింది. జాయ్ ఆండ్రూ 99ఏళ్ల వయసులో కరోనా బారిన పడింది. ఆ వయస్సులో కరోనా సోకితే చాలా వరకూ ఆశలు వదిలేసుకోవాల్సిందే. కానీ ఆమె జాయ్ ఆండ్రూ మరి. ఇక చెప్పేదేముంది. మరోసారి చావు ఆమె చేతిలో ఓడిపోయింది. కరోనా మహమ్మారిని కూడా జయించింది.


కరోనాతో ఆమె ఎంతగా పోరాడిందంటే..యువకులే ఆ మహమ్మారికి బలైపోయారు. ఈసారి కూడా ఆండ్రూ చావు అంచులదాకా వెళ్లివచ్చింది. ఆమెపై బంధువులు ఆశలు వదిలేసుకున్నారు. ఆమె ప్రస్తుతం నివశిస్తున్న మెడికల్ కేర్ ఫెసిలిటీ సిబ్బంది కూడా ఆమె ఇక బ్రతికే అవకాశం లేదని చేతులెత్తేశారు. ఆమె అంతిమ సంస్కారాలకు కూడా రెడీ చేసేశారు. చివరి చూపు కోసం ఆమె బంధువులకు కూడా కబురు చేశారు. కానీ ఆండ్రూ మాత్రం ఎప్పటిలానే చావుకు మళ్లీ టోకరా ఇచ్చింది.బతికి బయటకట్టి డాక్టర్లకే మతి పోగొట్టింది. ఈ క్రమంలోనే ఆదివారం అంటే నవంబర్ 22,2020న 100ఏళ్లు పూర్తి చేసుకుని పుట్టినరోజు చేసుకుంది. సెంచరీ కొట్టేసింది. ఆమెకు చికిత్స అందిస్తున్న మెడికల్ కేర్ సెంటర్‌ సిబ్బంది ఆమె పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏది ఏమైనా ఆండ్రూ గ్రేట్ కదా. ఇదంతా చూస్తుంటే.. చావైనా ఆండ్రూ పిలిస్తే ‘‘నాకు ఎన్నిసార్లు టోకరా ఇచ్చావ్..నిన్ను నమ్మను ఆండ్రూ’’అంటుందేమో..!

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *