లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

7 నెలలుగా కోమాలోనే కరోనా గర్భిణి : కళ్లుతెరిచేసరికి పండంటి కవలలు

Published

on

UK London corona pregnant women coma given birth to twins : కరోనా చేసే చిత్రాలు ఎన్నో ఎన్నెన్నో. విచిత్రమైన వార్తలకు వేదికగా నిలుస్తోంది ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్. కరోనా సోకి కోమాల్లోకి వెళ్లి పోయి నెలలు గడిచిన తరువాత తిరిగి స్మృహలోకి వచ్చిన ఓ మహిళా డాక్టర్ జీవితంలో విచిత్రం చోటుచేసుకుంది. సంతోషంతో ఆమె ఉక్కిరిబిక్కిరి అయిన ఘటన యూకేలోని బర్మింగ్ హామ్ సిటీ హాస్పిటల్ లో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బర్మింగ్ హామ్ లో ఓ ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్ పర్‌పెచ్యువల్ ఉకేకు కరోనా సోకింది. అప్పటికే గర్భవతి. కరోనా సోకిన తరువాత ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. దాంతో ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న మిగతా డాక్టర్లు వైద్య విధానాల ద్వారా ఆమెను కోమాలోకి పంపించారు.వెంటిలేటర్‌పై ఉంచి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. అలా ఏప్రిల్ నెలలో కోమాలోకి వెళ్లిన డాక్టర్ ఉకే.. ఇటీవలే కళ్లు తెరిచారు. తరువాత ఒక్కొక్కటిగా గుర్తు తెచ్చుకున్నారు. తనకు కరోనా సోకటం..తాను అప్పటికే గర్భవతిని అనే విషయం గుర్తుచేసుకున్నారు. కోమాలోంచి తిరిగి స్మృహలోకి వచ్చాక తాను ఎంత కాలం కోమాలో ఉన్నానో తెలుసుకున్నారు. అంటే ఏడు నెలలు గడిచిపోయాయి. గబగబా తన కడుపును తడిమి చూసుకున్నారు. ఎత్తుగా ఉండాల్సిన గర్భం లేకపోవడంతో ఆందోళన పడిపోయిందామె. తనకు గర్భస్రావం అయిందేమో అని భయపడిపోయింది.
కానీ ఆమెకు డాక్టర్లు థైర్యం చెప్పారు. నీ బిడ్డలకు ఏమీ కాలేదు. కోమాలో ఉండగానే పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చావు…నీ బిడ్డలు చక్కగా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. ఆ మాటకు డాక్టర్ అయిన ఆమే ఆశ్చర్యపోయింది. బిడ్డల్ని చూసుకోవాలని తెగ ఆతృతపడిపోయింది. ఇప్పుడు నా కండీషన్ ఎలా ఉంది డాక్టర్? నాకు కరోనా తగ్గిపోయిందా? నా బిడ్డల్ని నేను చూసుకోవచ్చా? అంటూ ఆతృతగా…ఆందోళనగా..ఆశగా అడిగారామె.దానికి డాక్టర్లు ఏమీ టెన్షన్ పడొద్దు..నీ పిల్లల్ని నువ్వు చూసుకోవచ్చు..పాలివొచ్చు..తల్లిగా నువ్వు నీ బిడ్డలకుఅన్నీ చేసుకోవచ్చు..నో టెన్షన్, నోప్రాబ్లమ్ అని చెప్పి ఇద్దరు కవలపిల్లల్ని ఆమెకు చూపించారు. అంతే ఒక్కసారిగా ఆమె తల్లి మనస్సు ఉప్పొంగిపోయింది. బిడ్డల్ని హృదయానికి హత్తుకుని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది.ఈ విషయంపై డాక్టర్లు మాట్లాడుతూ..ఉకే కోలుకోవడం ఆలస్యమైతే కడుపులో శిశువులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని..అందుకే ఆమెకు ప్రసవం సమయం కంటే ముందే జూలై నెలలో ఆమె డెలివరీ ఇవ్వాల్సి ఉంది. దీంతో ఆలోచించిన డాక్టర్లు చాలా ముందుగానే సిజేరియ్ ద్వారా 26 వారాలకే ఆమెకు డెలివరీ చేశారు. కోమా నుంచి తేరుకుని ఆందోళన చెందుతున్న ఉకేకు విషయం చెప్పి.. ఇద్దరు కవలలను చూపించారు. వారిద్దరినీ చూసిన ఉకే సంతోషానికి హద్దుల్లేవు. ఇది నిజంగా ఓ అద్భుతమని చెప్పి సంతోషంతో కన్నీరు పెట్టుకుంటోందామె.కాగా ఉకే కవలల్లో ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు పుట్టారు. పిల్లలిద్దరూ చక్కగా ముద్దులొలుకుతున్నారు. ఓ పాప సోచికా పామర్ బరువు 770 గ్రాములు కాగా బాబు ఒసినాచి సాస్కల్ బరువు 850 గ్రాములు ఉన్నారని డాక్టర్లు తెలిపారు. తన బిడ్డలను మురిపెంగా చూసుకుంటూ భార్య కోలుకోవాలని కొండంత ఆశతో ఎదురు చూసి ఉకే భర్త మాథ్యూ ఆశలు ఫలించాయి.భయకరమైన మహమ్మారిని జయించిన నా భార్య నిజంగా కరోనా యోథురాలు..నా బిడ్డలు నేను చాలా అదృష్టవంతులం అంటూ మురిసిపోయాడు. 116రోజుల తరువాత కవల పిల్లల్ని డాక్టర్లు డిశ్చార్జ్ చేయగా వారిని కంటికి రెప్పలా పెంచుతున్నారు మాథ్యూ. ఇప్పుడు భార్య కూడా కోలుకోవటంతో ఆయన సంతోషానికి హద్దులు లేవు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *