Home » రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని!
Published
2 months agoon
UK PM “Keen On Visiting India” జనవరిలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటనకు రాబోతున్నట్లు సమాచారం. 2021 గణతంత్ర దినోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధానమంత్రి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. గత వారం భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ..బ్రిటన్ ప్రధానమంత్రికి ఫోన్ చేసి జనవరి26న జరిగే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి చీఫ్ గెస్ట్ గా రావాలని ఆహ్వానించినట్లు సమాచారం.
అయితే, ఇప్పటివరకు విదేశాంగ మంత్రిత్వశాఖ నుంచి దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికార ప్రకటన లేదు. మరోవైపు, నవంబర్-27న బ్రిటన్ ప్రధానమంత్రితో నరేంద్రమోడీ ఫోన్ లో మాట్లాడినట్లు మాత్రం భారత్ అధికారికంగా ప్రకటించినప్పటికీ..రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి ఆహ్వానం పలికినట్లు మాత్రం పేర్కొనలేదు. కాగా, ప్రస్తుతం దేశంలో,మరీ ముఖ్యంగా దేశ రాజధానిలో కరోనావైరస్ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈసారి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ భారీ స్థాయిలో నిర్వహించే అవకాశం లేనట్లు సృష్టంగా అర్థమవుతోంది.
కాగా, వీలైనంత త్వరలో భారత పర్యటనకు రావాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆశక్తిగా ఉన్నారని ఓ బ్రిటీష్ హైకమిషన్ ప్రతినిధి తెలిపారు. మరోవైపు, భారత్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్ కి హాజరైన చివరి బ్రిటీష్ ప్రధాని జాన్ మేజర్. 1993లో బ్రిటన్ ప్రధానిగా ఉన్న జాన్ మేజర్ భారత రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ తర్వాత ఇప్పటివరకు బ్రిటన్ ప్రధానమంత్రులు భారత గణతంత్ర దినోత్యవ వేడుకల్లో పాల్గొనలేదు.
మరోవైపు, భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ,బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఫోన్ లో మాట్లాడుకున్నారని… కరోనా వ్యాక్సిన్,వాతావరణ మార్పులు,రక్షణ,వాణిజ్యం సహా పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ విషయాలపై ఇరు దేశాధినేతలు చర్చించినట్లు డౌనింగ్ స్ట్రీట్(బ్రిటన్ ప్రధాని కార్యాలయం)నవంబర్-27,2020న ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.
కాగా, బోరిస్ తో సంభాషణ అద్భుతంగా సాగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనంతరం ట్వీట్ లో పేర్కొన్నారు. బోరిస్‌ను స్నేహితుడిగా అభివర్ణించిన మోడీ .. వచ్చే దశాబ్దంలో భారత్-బ్రిటన్ మధ్య సంబంధాల కోసం ప్రతిష్ఠాత్మక రోడ్ మ్యాప్ ను బోరిస్ సిద్ధం చేశారని చెప్పారు. కరోనా పోరుతో పాటు వాతావరణ మార్పులు, రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకారం పెంపొందించుకోవాలని అంగీకరించుకున్నట్లు చెప్పారు.