Home » కోవిడ్ వ్యాక్సిన్ ను ఆమోదించటానికి సిధ్ధంగా ఉన్న బ్రిటన్ ప్రభుత్వం
Published
2 months agoon
By
murthyUK regulator set to approve COVID-19 vaccine next week : బయో ఎన్ టెక్ ఎస్ఇ, మరియు ఫైజర్ సంస్ధ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించడానికి సిధ్దంగా ఉందని, ఆమోదం పొందిన కొద్ది గంటల్లోనే పంపిణీ చేసేందుకు వ్యవస్ధను సిధ్దం చేస్తోందని ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక ప్రచురించింది.
ఫైజర్, బయోఎన్ టెక్ మొట్ట మొదటి సారిగా తయారు చేసిన వ్యాక్సిన్ ను డిసెంబర్ 7 నుంచి ఉపయోగం లోనికి తీసుకురావచ్చని ఆ పత్రిక తెలిపింది. బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్, ప్రస్తుతం జూనియర్ వాణిజ్య మంత్రిగాఉన్న నాదిమ్ జహావిని కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీకి ఇన్ చార్జిగా నియమించారు.
ఫైజర్, బయోఎంటెక్, తయారు చేసిన కోవిడ్ -19 వ్యాక్సిన్ పని తీరుయొక్క నాణ్యత, అనుకూలతలను అంచనా వేయమని నవంబర్ 20న బ్రిటన్ తన మెడికల్ రెగ్యులేటర్, మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్‌ఎ) ను ఆదేశించింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సోకి 1.4 మిలియన్ల మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ నిర్వీర్యమైపోయింది. ఫైజర్, బయోఎన్ టెక్ తయారు చేసిన వ్యాక్సిన్ 95 శాతం ప్రభావవంతమైనదని తేలటంతో బ్రిటన్ 20 మిలియన్ డోసుల కొనుగోలుకు ఆర్డర్ చేసింది.
మరో వైపు ఆస్ట్రాజెన్ కా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన వ్యాక్సిన్ పని తీరును కూడా పరిశీలించమని ప్రభుత్వం శుక్రవారం ఎంహెచ్‌ఆర్‌ఎ ను కోరింది. దాని పనితీరు మెరుగ్గా ఉంటే 100 మిలియన్ డోసులను కొనుగోలు చేసి క్రిస్మస్ పండుగకు ముందే ప్రజలకు అందించటానికి సిధ్దంగా ఉంది.