లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

దీన్నే పిచ్చంటారమ్మా : ఫొటో షూట్ కోసం రైల్వే క్రాసింగ్ మీద పడుకుని..ఫోజులు

Published

on

uk woman lies on railway crossing photos : యూకేలోని బ్రిటన్ లో ఫోటో షూట్ కోసం వచ్చిన ఓ మహిళ ఏకంగా లెవెల్ క్రాసింగ్ వద్ద ట్రాక్ పైన పడుకుంది. ఫొటో దిగేందుకు ట్రాక్​పైనే పడుకుంది. రైళ్లు వస్తే పరిస్థితి ఏంటని కూడా ఆలోచించలేదు. చక్కగా వచ్చి ట్రాక్ పైన పడుకుంది. తాపీగా ట్రాక్​పై పడుకుని ఫొటోలకు ఫోజులిచ్చింది. కెమెరా పట్టుకున్న ఫోటోలు తీసే వ్యక్తి కూడా ఆమెకు అది ప్రమాదం అని చెప్పలేదు. సరికదా తన ఫోటో ఫ్రేమ్ కరెక్ట్ చేసుకుని ఆమె పడుకోగానే ఫోటో క్లిక్ మనించారు.

ఈ దృశ్యం మొత్తం సీసీ కెమెరాలల్లో రికార్డ్ అయ్యింది. అది చూసిన బ్రిటన్ రైల్వే నెట్​వర్క్ హెచ్చరికలు జారీ చేసింది. పలు సూచనలు చేసింది. కాగా రైల్వే క్రాసింగ్​ వద్ద ఫొటోలు దిగిన ఆ మహిళ వీడియో కాసేపట్లోనే వైరల్​గా మారింది. దీంతో ఆమె నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడ్డారు. ఇంత నిర్లక్ష్యమా? వైరల్ కోసం మరీ ఇంత బాధ్యతలేకుండా బిహేవ్ చేస్తారా? అంటూ తిట్టిపోస్తున్నారు.

కాగా ప్రతీ చిన్న చిన్న సందర్భాలకు కూడా ఫోటో షూట్ సర్వసాధారణంగా మారిపోయాయి. ఈ ఫోటో షూట్ కు ఏ లెవెల్ కు వెళ్లాయంటే.. అడ్వంచర్లు కూడా చేసేస్తున్నారు. ప్రాణాలు పోతాయని కూడా చూసుకోవటంలేదు. షోటో షూట్ ల కోసం చేసే ఫీట్లతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.