కాంబో కుదిరింది.. కమల్ 232 అనౌన్స్‌మెంట్!..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Kamal Haasan New Movie: విశ్వనటుడు కమల్ హాసన్ కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన బుధవారం సాయంత్రం వెల్లడైంది.. సొంత సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ నటిస్తూ నిర్మించనున్నారు.


తమిళనాట ‘అవాల్’, ‘మా నగరం’ ‘ఖైదీ’ చిత్రాలతో ఆకట్టుకున్న యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ అభిమాని అయిన లోకేష్ తన అభిమాన నటుణ్ణి డైరెక్ట్ చేయనుండడం విశేషం. కమల్ నటిస్తున్న 232వ సినిమా ఇది.


‘‘Once Upon A Time There Lived A Ghost’’ అంటూ వివిధ రకాల గన్స్ తో డిజైన్ చేసిన పోస్టర్ రిలీజ్ చేశారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను 2021 వేసవిలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.Kamal Haasan New Movie

Related Posts