లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఆన్‌లైన్‌లో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య..

Published

on

Uma Maheswara Ugra Roopasya going to be Release in OTT Soon

కరోనా కారణంగా చిన్న సినిమాలు ఓటీటీ ద్వారా ఆన్‌లైన్‌లో థియేటర్ల కంటే మందే విడుదల అవుతతున్నాయి. మరికొన్ని రోజులు థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి కూడా లేకపోవడంతో లేటెస్ట్‌గా తెలుగు సినిమా స్థాయిని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన బాహుబ‌లి సినిమా నిర్మించిన నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని తీసిన `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌` సినిమాని ఆన్‌లైన్‌లో విడుదల చెయ్యాలని నిర్ణయించుకున్నారు.

ఆర్కా మీడియా వ‌ర్క్స్, మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మాత‌లుగా `కేరాఫ్ కంచ‌పాలెం` ఫేమ్ వెంక‌టేష్ మ‌హ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా ఇది. మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌` చిత్రానికి ఇది రీమేక్‌. తెలుగులో స‌త్య‌దేవ్ హీరోగా ఈ సినిమాలో న‌టిస్తున్నారు.

జులై 15న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతోంది. నరేష్‌, హరి చందన, జబర్దస్త్‌ రాంప్రసాద్‌, టీఎన్‌ఆర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జాతీయ అవార్డు గ్రహీత బిజిబాల్‌ ఈ సినిమాకి సంగీతం అందించారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. గ్రామీణ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. స‌త్య‌దేవ్ ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌ని లుక్‌తో క‌న‌ప‌డుతున్నారు. ఈ చిత్రంలో ఆయ‌న ఫొటోగ్రాఫ‌ర్‌గా క‌న‌ప‌డుతున్నారు. అరకు వ్యాలీలో 36 రోజుల్లోనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు.

Read:అమ్మాయిల్ని బతకనివ్వరారా.. IPC 376 ట్రైలర్..

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *