లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

రేయ్ మహేషూ.. కొట్రావాణ్ణి..

సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ టీజర్ విడుదల..

Published

on

Uma Maheswara Ugra Roopasya - Teaser

సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ టీజర్ విడుదల..

‘కేరాఫ్ కంచెరపాలెం’ వంటి విభిన్న కథా చిత్రంతో ప్రేక్షకుల ఆదరణ, విమర్శకుల ప్రశంసలు అందుకున్న యువ దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం.. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’.. #UMUR మలయాళంలో విజయవంతమైన ‘మహేశింతే ప్రతీకారమ్’ చిత్రానికి రీమేక్ ఇది.

‘బాహుబలి’ నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు. సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా సీనియర్ నటుడు నరేష్ కీలకపాత్రలో కనిపించనున్నారు. మహా శివరాత్రి సందర్భంగా  ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. విలేజ్ నేపథ్యంలో రూపొందుతున్న ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’లో సత్యదేవ్ ఫోటోగ్రాఫర్‌గా కనిపిస్తున్నాడు. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. ‘కేరాఫ్ కంచెరపాలెం’ తరహాలోనే దర్శకుడు వైవిధ్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని అర్థమవుతోంది.

త్వరలో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సుహాస్, జబర్ధస్త్ రామ్ ప్రసాద్, టీఎన్ఆర్, రవీంద్ర విజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నర్ బిజిబాల్ సంగీతమందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ : అప్పూ ప్రభాకర్, ఎడిటింగ్ : రవితేజ గిరిజాల, కథ : శ్యామ్ పుష్కరన్.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *