‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’పై ప్రశంసల జల్లు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు వెంకటేష్ మహా రూపొందించిన రెండో చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. సత్యదేవ్, హరిచందన హీరో హీరోయిన్లుగా నటించారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. సత్య ఇరగదీసాడు. నరేష్‌గారు, హీరోయిన్, ఇతర నటీనటులందరూ బాగా నటించారు. డైరెక్షన్, సంగీతం చాలా బాగున్నాయి. చిత్రబృందం మొత్తానికి ధన్యవాదాలు- దర్శకుడు పూరీ జగన్నాథ్.

 

ఇప్పుడే ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా చూశాను. ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడి నుంచి వచ్చిన మరో మంచి ఫీల్ ఉన్న సినిమా. సినిమాలో చాలా మంచి సన్నివేశాలున్నాయి. సంగీతం హృద్యంగా ఉంది- ఎమ్ఎమ్ కీరవాణి.

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చాలా అందమైన సినిమా. అనుమతులు లభించిన తర్వాత థియేటర్లలో కూడా ఈ సినిమాను విడుదల చేయాలి. సినిమాలోని కొన్ని సన్నివేశాలను పెద్ద తెరపై కూడా చూడాలనుకుంటున్నా. డైరెక్టర్ వెంకటేష్ మహా నిజాయితీకి ధన్యవాదాలు. సత్యదేవ్‌కు పెద్ద అభిమానిని. సుహాస్ చాలా బాగా చేశాడు- నాని.Related Posts