Home » ఈఎమ్ఐలు కట్టలేక కుటుంబంలో ఐదుగురు సూసైడ్
Published
3 months agoon
By
subhnAssam: ఆర్థిక సమస్యలు ఆ కుటుంబాన్ని ముంచేశాయి. తీసుకున్న అప్పులకు పెరిగిన వడ్డీలు కట్టలేక కుటుంబం(భార్య, ముగ్గురు కూతుళ్లు)తో సహా ఆత్మహత్య చేసుకున్నారు. అస్సాంలోని కొక్రాఝార్ జిల్లాలో సోమవారం జరిగిన ఘటనతో అంతా షాక్ అయ్యారు.
45ఏళ్ల నిర్మల్ పాల్ కుకింగ్ గ్యాస్ సబ్ ఏజెన్సీని నిర్వహిస్తున్నాడు. బ్యాంకులు, లోకల్ వ్యాపారుల దగ్గర్నుంచి రూ.25-30లక్షల వరకూ అప్పులు చేశాడు. కొద్ది నెలలుగా ఈఎమ్ఐలు పే చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఆదివారం గౌహతి నుంచి ఐదుగంటల ప్రయాణ దూరంలోని గ్రామంలో ఐదుగురు చనిపోయి కనిపించారు.
నిర్మల్ పాల్, మల్లికా (40) కూతుళ్లు మృతి చెందినట్లు ఎస్పీ రాకేశ్ రౌషన్ న్యూస్ ఏజెన్సీకి వెల్లడించారు. అతని పెద్ద కూతురు పూజా(25) సైన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పనిచేస్తుంది. మిగిలిన ఇద్దరు స్కూల్ లో చదువుకుంటున్నారు.
మద్యం తాగడంలో అస్సోం మహిళలే టాప్ : కేంద్ర సర్వేలో తేలిన నిజం
ఆల్ అస్సాం బంగాళీ యుబా ఛత్రా ఫెడరేషన్ కు చెందిన కొక్రాఝార్ యూనిట్ వారికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తుంది. సోమవారం పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీలను హాస్పిటల్ కు తరలించారు.