బిల్లు కట్టలేకపోతే బిడ్డను మాకే అమ్మేయండి :ప్రైవేటు ఆస్పత్రి దారుణం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దళితురాలైన నిరుపేద అయిన బబిత (36) గర్భవతి అయ్యింది. భర్త శివచరణ్ రిక్షాతొక్కుతూ బతుకు బండిని లాగిస్తున్నాడు.గర్భవతి అయిన బబితకు ఇటీవలే సిజేరియన్ ద్వారా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. తరువాత డిశ్చార్జ్ చేసేటప్పుడు ఆస్పత్రి ట్రీట్ మెంట్ ఖర్చులు..మందులు అన్నీ కలిపి మొత్తం రూ.35వేలు బిల్లు వేసింది. ఆ బిల్లు చూసిన బబిత దంపతులు హడలిపోయారు. భార్య గర్భవతి అయినప్పటినుంచి శివ చరణ్ రూపాయి రూపాయి కూడబెట్టి కొంత మొత్తం పొదుపు చేశాడు. కానీ ఆస్పత్రి బిల్లు కట్టేంతు డబ్బు మాత్రం వారి దగ్గర లేదు. దీంతో..అంతటి డబ్బు ఇచ్చుకోలేము అంటూ తమ దీన స్థితి చెప్పుకున్నారు.


దానికి ఆ ఆస్పత్రి యాజమాన్యం ఊహించని మాట చెప్పింది. అది బబిత భర్తా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అదేమంటే..‘‘ఆస్పత్రి బిల్లు కట్టలేకపోతే.. బిడ్డను తమకు అమ్మేయాలంటూ ఆస్పత్రి యాజమాన్యం సూచించింది. లేకుండా ఆస్పత్రినుంచి వెళ్లనిచ్చేది లేద’’ని కరాఖండీగా చేప్పేసింది. రూ.లక్ష ఇస్తాం బిడ్డను ఇచ్చేయండి..మీకు ఆస్పత్రి ఖర్చులు ఉండవు పైగా లక్ష రూపాయలు వస్తాయంటూ ఆఫర్ ఇచ్చింది.

స్టడీ: అంత ఎట్రాక్టీవ్ గా కనిపించనివాళ్లు… మేం చాలా అందంగా ఉన్నారనుకుంటారు!


దీంతో ఆ దంపతులు కన్నబిడ్డను వదులుకోలేక..బిల్లు కట్టలేక మానసికంగా నరకయాతన అనుభవించారు.కానీ చేసేదేమీ లేక..బిడ్డను ఆస్పత్రికి అప్పగించి..బిడ్డను వదులుకున్నారు. యూపీలోని ఆగ్రాలో జరిగిన ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. అలా ఆస్పత్రినుంచి బైటపడ్డ ఆ బబిత దంపతులు బైటకు వచ్చి ఈ విషయాన్ని మీడియాకు చెప్పారు.


లక్ష రూపాయలు తీసుకుని బిడ్డను వదులుకోవాలని ఆస్పత్రి సిబ్బంది చెప్పారని వారం రోజుల వయసున్న తమ బిడ్డను వదులుకున్నామని కన్నీరు మున్నీరవుతూ చెప్పారు. ఈ విషయం మీడియా ద్వారా జిల్లా మేజిస్ట్రేట్ దృష్టికి వెళ్లటంతో ‘ఇది చాలా తీవ్రమైన విషయం అనీ..దీనిపై దర్యాప్తు ప్రారంభించి..నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం’అని తెలిపారు.


జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల ప్రకారం సదరు ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. ‘ఈ ఆరోపణలు నిజం కాదు. బిడ్డను వదులు కోవాలని మేము బలవంతం చేయలేదు. వారే స్వయంగా తమ బిడ్డను దత్తత నిచ్చారని తెలిపారు. దీనికి సంబంధించి వారి పూర్తి అనుమతితో బబిత దంపతులు సంతకాలు కూడా చేశారని దానికి సంబంధించిన డాక్యుమెంట్లు మావద్ద ఉన్నాయని తెలిపింది.


ఈ ఘటనపై బాలల హక్కుల సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. సంతలో పశువుల్ని కొన్నట్లుగా పసిబిడ్డల్ని కొంటున్న ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కాగా బబిత దంపతులు ఆగ్రాలోని శంభు నగర్ లో ఓ చిన్న ఇంటిలో అద్దెకుంటున్నారు. బబిత భర్త రిక్షా తొక్కుతూ..రోజుకు రూ.100లు సంపాదిస్తాడు. అతని 18 ఏళ్ల కొడుకు లాక్ డౌన్ ముందు వరకూ ఓ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. కానీ లాక్ డౌన్ తో ఫ్యాక్టరీ మూసివేయటంతో ఆ ఉపాధి కూడా పోయింది.

READ  తీరు మారడం లేదు : డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. 15 వాహనాలు సీజ్

Related Posts