ఏపీలో పెరిగిన 15 లక్షల మంది ఓటర్లు: ఈసీ

ఏపీలో పెరిగిన 15 లక్షల మంది ఓటర్లు: ఈసీ

ఏపీలో పెరిగిన 15 లక్షల మంది ఓటర్లు: ఈసీ

అమరావతి : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగుతున్న క్రమంలో ఎన్నికల సంఘం అధికారులు ఓటర్ల లిస్ట్ ను తయారు చేశారు. ఈ క్రమంలో ఏపీలో ఓటర్ల సంఖ్య పెరిగిందని తెలిపారు. ఓటర్ల సంఖ్య జనవరితో పోలిస్తే మరో 15 లక్షలు పెరిగిందనీ. దీంతో ఏపీలో మొత్తం ఓటర్లు 3.84 కోట్లకు చేరుకుందని మార్చి 19న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. మార్చి 25న తుది జాబితా ప్రకటించేనాటికి ఈ సంఖ్య 3.95 కోట్లకు చేరే అవకాశముందని..గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఇది 18 లక్షలు ఎక్కువనీ ఆయన పేర్కొన్నారు.  

  • ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకాలు
  • 2014 ఎన్నికల్లో ఓటర్లు సంఖ్య 3,67,60,880
  • 2019 జనవరి 11 నాటికి ఓటర్లు 3.69 కోట్లు 
  • తొలగించిన (మృతి చెందిన సందర్భాలు)ఓట్లు  1.55 లక్షలు 
  • పరశీలించాల్సిన అప్లికేషన్స్ 10,62,441

అలాగే కొత్త ఓటర్లుకు ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ ఏప్రిల్ 5లోగా పూర్తిచేస్తామని ఆయన తెలియజేశారు. జనవరి 11న సమగ్ర ప్రత్యేక సవరణ-2019కు సంబంధించిన తుది జాబితా ప్రచురించే నాటికి ఓటర్ల సంఖ్య 3.69 కోట్ల ఉండగా, మూడు నెలల వ్యవధిలో 15 లక్షల మంది పెరిగారని పేర్కొన్నారు. ఓటు నమోదుకు వచ్చిన దరఖాస్తుల్లో ఇంకా 10,62,441 పరిశీలన పూర్తి చేయాల్సి ఉందని, మార్చి 25 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే మరో 9.50 లక్షల మంది ఓటర్లు పెరిగే అవకాశముందని గోపాలకృష్ణ ద్వివేది వివరించారు. 
Read Also :దొడ్డిదారిన కాదు.. రాయల్‌గా తీసుకొచ్చా : నాగబాబు ఎంట్రీపై పవన్

అలాగే ఓట్ల తొలగింపునకు సంబంధించి జనవరి 11 తర్వాత దాదాపు 9 లక్షలకు పైగా ఫారం-7 దరఖాస్తు లొచ్చాయని, వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి 1,55,099 మంది పేర్లను జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించినట్టు తెలియజేశారు. వీటిలో చనిపోయినవారు, వలసపోయిన (వేరే ప్రాంతాలకు వెళ్లినవారు) వారు..ఉన్నారన్నారు. మిగతా అప్లికేషన్స్ ను ఫేక్ గా గుర్తించి తిరస్కరించామని..వీటిపై కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

×