నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : కొత్తగా 16వేల ఉద్యోగాలు

దశలవారీగా మద్య నిషేధమే లక్ష్యంగా ఏపీలో కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించనుంది. ఇందులో భాగంగా

  • Published By: veegamteam ,Published On : August 28, 2019 / 03:03 PM IST
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : కొత్తగా 16వేల ఉద్యోగాలు

దశలవారీగా మద్య నిషేధమే లక్ష్యంగా ఏపీలో కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించనుంది. ఇందులో భాగంగా

దశలవారీగా మద్యపానం నిషేధమే లక్ష్యంగా ఏపీలో కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించనుంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి పైలట్‌ ప్రాజెక్టు కింద 503 లిక్కర్ షాపులు  ఏర్పాటు చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు సీఎం జగన్ కి వివరించారు. మద్యం దుకాణాల ఏర్పాటు ద్వారా 16వేల ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు. ఆదాయార్జన శాఖలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్ లో నిర్వహించిన సమీక్షకు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌, రవాణా, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రస్తుత పరిస్థితులను విభాగాల వారీగా అధికారులు సీఎంకు నివేదించారు.

మద్యం వినియోగం గణనీయంగా తగ్గిందని అధికారులు సీఎంకి తెలిపారు. 2018-19లో 125 లక్షల కేసుల మద్యం విక్రయం జరిగిందన్నారు. బెల్టు షాపుల తొలగింపుతో 2019 జులై నాటికి 12 లక్షల కేసుల వినియోగం  తగ్గిందన్నారు. మద్య నియంత్రణ, నిషేధానికి, డీ ఎడిక్షన్‌ సెంటర్ల ఏర్పాటుకు నిధులు పెంచుతున్నట్లు తెలిపారు. మద్య నియంత్రణ, నిషేధం అమలుకు ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసు విభాగాలను మరింత బలోపేతం  చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. స్మగ్లింగ్‌ జరగకుండా, నాటు సారా తయారీ కాకుండా చూడాలన్నారు. మద్యం వల్ల వచ్చే అనర్థాల గురించి పుస్తకాల్లో ఉంచాలన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు మద్య  నియంత్రణ, నిషేధంపై ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. మద్య నిషేధం అమలు కోసం గ్రామ సచివాలయంలో మహిళా పోలీసులను నియమించాలని సూచించారు.

ఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. మద్యం మాఫియాను పూర్తిగా అరికట్టేందుకు ప్రైవేట్ షాపులను రద్దు చేయాలని జగన్ నిర్ణయించారు. ఎన్నికల హామీకి అనుగుణంగా పాలసీకి రూపకల్పన చేసిన అధికారులు… ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించేలా విధివిధానాలు రూపొందించారు. అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ఏపీలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్రంలో 3వేల 500 మద్యం దుకాణాలు మాత్రమే నడిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొత్త పాలసీ ప్రకారం ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌ మద్యం దుకాణాలను నిర్వహించనుంది. మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ఎక్కడెక్కడ షాపులను పెట్టాలనేదానిపై బేవరేజెస్ కార్పొరేషనే నిర్ణయం తీసుకుంటుంది.