కొత్త అందాలు : వరంగల్‌ లో 162 స్మార్ట్ బస్ షెల్టర్లు

  • Published By: madhu ,Published On : February 13, 2019 / 05:30 AM IST
కొత్త అందాలు : వరంగల్‌ లో 162 స్మార్ట్ బస్ షెల్టర్లు

తెలంగాణలో రెండో అతిపెద్ద నగరం వరంగల్. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. దీంతో మెయిన్ రోడ్లు సుందరంగా ముస్తాబవుతున్నాయి. సుందర సిటీగా తీర్చిదిద్దేందుకు.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా అత్యాధునిక బస్ షెల్టర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.100 కోట్ల నిధులతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. వరంగల్ సిటీ మొత్తం 162 స్మార్ట్ బస్ షెల్టర్లను నిర్మించేందుకు డిసైడ్ అయ్యారు.

2019, ఫిబ్రవరి 18వ తేదీన ఆయా కన్సెల్టెన్సీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 23న స్మార్ట్ బస్ షెల్టర్ల టెండ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు నిర్ణయించారు. కన్సల్టెన్సీలతో చర్చల తర్వాత ఫిబ్రవరి 23న టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. 

ఎక్కడెక్కడ స్మార్ట్ బస్ షెల్టర్లు అంటే :
మడికొండ నుంచి వరంగల్ వరకు బస్ షెల్టర్లు నిర్మించనున్నారు. నాలుగు స్మార్ట్ రోడ్లు రెడీ అవుతున్నాయి. అంతర్గత రహదారుల విస్తరణ పనులు స్పీడ్‌ అందుకున్నాయి. పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి నయీంనగర్ మీదుగా కేయూసీ వైపు ఓ మ్యాప్ సిద్ధం చేశారు. కేయూ, పెద్దమ్మ గడ్డ బైపాస్ రోడ్డు, కాజీపేట నుంచి ములుగు రోడ్డు జంక్షన్ వరకు స్మార్ట్ రోడ్లు ఏర్పాటవుతున్నాయి. ప్రధాన రహదారులను కలుపుతూ ఈ షెల్టర్లు నిర్మించనున్నారు. ఈ షెల్టర్లలో ఆధునిక వసతులు ఉంటాయి. ఐదు డిజైన్లను రూపొందించారు. టాయిలెట్లు, వైఫై, సీటింగ్ ఉంటుంది. హైదరాబాద్ తరహాలో క్లోజ్డ్ గ్లాస్ రూం, ఏసీ సౌకర్యం ఉండేలా డిజైన్ చేశారు. స్మార్ట్ సిటీలో స్మార్ట్ బస్ షెల్టర్లు త్వరలోనే నగర వాసులకు అందుబాటులోకి రానున్నాయి.