చీర కట్టుకుని డ్యాన్స్ చేసిన యువకుడు..వీడియో డిలీట్ చేయమన్నందుకు పొడిచి చంపేసిన ఫ్రెండ్స్:ధారవిలో దారుణం

  • Published By: nagamani ,Published On : July 11, 2020 / 01:17 PM IST
చీర కట్టుకుని డ్యాన్స్ చేసిన యువకుడు..వీడియో డిలీట్ చేయమన్నందుకు పొడిచి చంపేసిన ఫ్రెండ్స్:ధారవిలో దారుణం

స్నేహితులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేద్దామనుకున్న ఓ కుర్రాడు చక్కగా చీర కట్టుకుని డాన్స్ చేశాడు. ఆ డాన్స్‌ను స్నేహితులు వీడియో తీశారు. అలా అలా వారి సరదా సరదా ఎంజాయ్ మెంట్ కాస్తా సీరియస్ అయిపోయింది.ఎంత సీరియస్ అంటే పొచిడి చంపి ప్రాణం తీసేంత..! ముంబైలోని ధారవీలో ఈ దారుణం బుధవారం (జులై,2020)జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ధార‌విలోని సుభాష్ న‌గ‌ర్‌లో నివాసం ఉంటున్న కౌశిక్ అనే 17 ఏళ్ల యువకుడు ఓరోజు తన స్నేహితులతో సరదాగా గడుపుదామని ధారవిలోనే ఉంటున్న ఫ్రెండ్స్ దగ్గ‌రికి వెళ్లాడు. సరదాగా జోకులు వేసుకున్నారు. హాయిగా నవ్వుకున్నారు. డాన్స్ చేద్దాంరా…అనుకుంటూ అందరూ ఒకరి తరువాత ఒకరు డ్యాన్స్ లు వేశారు. తరువాత కౌశిక్ వంతు వచ్చింది. దీంతో ఇంకా జోష్ గా ఉంటుందని కౌశిక్ చీర కట్టుకుని డ్యాన్స్ వేశారు. దీంతో ఏ పోరీ..అంటూ ఫ్రెండ్స్ అంతా కౌశిక్ డ్యాన్స్ ను ఎంజాయ్ చేశారు. ఫోన్ లో వీడియో తీశారు.

డ్యాన్ చేయటం అయిపోయాకు ఆ వీడియోను అంద‌రికీ చూపించి కౌశిక్‌ను ఆట‌ ప‌ట్టిద్దామ‌ని అనుకున్నారు. ఏ..అలా వద్దురా..ఇది ఎవరన్నా చూస్తే బాగుండదు..తరువాత నన్ను ఏడిపిస్తారు..దాన్ని డిలీట్ చేయమని ఫ్రెండ్స్ తో అన్నాడు.కానీ ఫ్రెండ్స్ ఒప్పుకోలేదు. దీనికి కౌశిక్ కు కోపం వచ్చింది.
డాన్స్ వీడియోను డిలీట్ చేయండి..లేకపోతే మా అంకుల్ కి చెబుతాను..పోలీసులకు కూడా చెబుతాను అంటూ చిన్నగా బెదిరించాడు.

అయినా వారు ఆ వీడియోను డిలీట్ చేయలేదు.దీంతో కౌశిక్ త‌న అంకుల్ ఇంటికి వెళ్లాడు. అది తెలిసిన స్నేహితులు సీరియస్ అయ్యారు.అంకుల్ ఇంటినుంచి తిరిగి వ‌స్తుండగా..హనుమాన్ చౌక్ వద్ద కౌశిక్‌ను ఆపి క‌త్తితో పొడిచేశారు. ఆవేశంతో చేశారా? కావాలనే ఫ్రెండ్ ను చంపాలనుకున్నారో తెలీదు గానీ..తరువాత తీవ్ర గాయాల‌తో గిలగిలా కొట్టుకుంటున్నా కౌశిక్ ఆసుపత్రికి త‌ర‌లించారు. కానీ అప్పటికే తీవ్ర రక్తస్రావం కావటంతో చికిత్స పొందుతూ కౌశిక్ మృతిచెందాడు.
ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు మొదలుపెట్టగా..కౌశిక్ హ‌త్య‌కు కార‌ణ‌మైన న‌లుగురు యువ‌కుల‌ను పోలీసులు గురువారం (జులై9,2020)న అరెస్టు చేశారు. ఆ న‌లుగురిలో ముగ్గురు మైన‌ర్లు ఉండగా.. వారిని డొంగ్రి రిమాండ్ హోమ్‌కు త‌ర‌లించి విచారిస్తున్నారు.