రాజధాని భూముల్లో 4 వేల ఎకరాల ఇన్ సైడర్ ట్రేడింగ్ : కేబినెట్ సబ్ కమిటీ నివేదిక

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూముల విషయంలో ఇన్ ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిదంటూ వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఓ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.

  • Published By: veegamteam ,Published On : December 28, 2019 / 04:19 AM IST
రాజధాని భూముల్లో 4 వేల ఎకరాల ఇన్ సైడర్ ట్రేడింగ్ : కేబినెట్ సబ్ కమిటీ నివేదిక

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూముల విషయంలో ఇన్ ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిదంటూ వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఓ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూముల విషయంలో ఇన్ ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిదంటూ వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఓ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదిక ప్రకారం 4 వేల ఎకరాల భూమి ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ కేబినెట్ సబ్ కమిటీ నివేదిక అందించింది. 2014 జూన్ 1 నుంచి 2014 డిసెంబర్ 31 వరకు భూ లావాదేవీలు జరిగినట్లు కేబినెట్ సబ్ కమిటీ నివేదికలో పేర్కొంది. 

లింగమనేని రమేష్ భార్య, బంధువుల పేర్ల మీద భూములు కొనుగోలు, బినామీ సంస్థ అభినందన హౌసింగ్ పేరుతో మాజీ ఎమ్మెల్యే తుమ్మలపాటి శ్రీధర్ కు 68.6 ఎకరాలు, బినామీ గుమ్మడి సురేష్ పేరుతో పత్తిపాటికి 38.84 ఎకరాలు, నారా లోకేష్ బినామీ పేరిట 62.77 ఎకరాలు ఉన్నట్లు నివేదికలో తేలింది.

ఇక వేమూరి రవి కుమార్ ఫీచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఫీచర్ ట్రెండ్స్ కన్ స్ట్రక్షన్స్, గోశ్పతి గ్రీన్ ఫీల్డ్ పేరుతో భూములు, మైత్రి ఇన్ఫ్రా  పేరుతో రావెల కిషోర్ బాబు బినామీలకు 40.85 ఎకరాలు, శశి ఇన్ఫ్రా పేరుతో మాజీ స్పీకర్ కోడెల బినామీలకు 17.13 ఎకరాలు ఉన్నట్లు వెల్లడించింది. పల్లె రఘునాథ్ రెడ్డి, పయ్యావుల కేశవులు, ధూళిపాళ్ల నరేంద్ర, మురళీ మోహన్, గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అమరావతిలో భూములున్నట్లు నివేదికలో వెల్లడించింది. తాజా నివేదిక ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. 

మరోవైపు ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. రాజధాని అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐతో విచారణ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించే ముందు న్యాయనిపుణులతో సంప్రదించాలని మంత్రి వర్గ సమావేశం భావించింది. అమరావతిని రాజధానిగా ప్రకటించే ముందు భూకొనుగోళ్లపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇవ్వడంతో దానిపై చర్చించి సీబీఐ విచారణకు ఆదేశించాలని సీఎం జగన్ కేబినెట్ నిర్ణయించింది. 

మాజీ సీఎం చంద్రబాబు హయాంలో అమరావతి ఏర్పడింది కాబట్టి సీఎం జగన్ చంద్రబాబుని టార్గెట్ గా చేసుకుని ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ విచారణకు వెళ్లే యోచనలో సీఎం జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై సీఎం జగన్ కు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి సీఎం సలహాలు తీసుకున్నారు. అవన్నీ కలిపి నివేదిక సిద్ధం చేయటం..ఈ నివేదిక సీఎం జగన్ కు చేరటం..దీంతో ఇప్పటికే అసెంబ్లీలో ప్రభుత్వం ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన వారి వివరాలను బహిర్గతం చేశారు. 

దీంట్లో భాగంగా..రాజధాని అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పైన సీబీఐ విచారణకు ఇవ్వాలని పలువురు మంత్రులు కేబినెట్ సమావేశంలో వెల్లడించినట్లుగా తెలుస్తోంది.  దీని పైన న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకొని తుది నిర్ణయం తీసుకుందామని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం.  అదే సమయంలో కేంద్రంతోనూ చర్చించాలని భావిస్తున్నారు.