ఏపీలో 40 మంది పిల్లలకు కరోనా, అంతా ఢిల్లీ నుంచి వచ్చిన వారి పిల్లలే

మొదట వృద్ధులే కరోనా వైరస్ బారిన పడుతున్నారని అంతా అనుకున్నారు. కానీ యువతకు కూడా ఈ వైరస్ ఎక్కువగా సోకుతోందని మొన్న తేల్చారు.  ఇప్పుడు మరో షాకింగ్

  • Published By: veegamteam ,Published On : April 16, 2020 / 11:16 AM IST
ఏపీలో 40 మంది పిల్లలకు కరోనా, అంతా ఢిల్లీ నుంచి వచ్చిన వారి పిల్లలే

మొదట వృద్ధులే కరోనా వైరస్ బారిన పడుతున్నారని అంతా అనుకున్నారు. కానీ యువతకు కూడా ఈ వైరస్ ఎక్కువగా సోకుతోందని మొన్న తేల్చారు.  ఇప్పుడు మరో షాకింగ్

మొదట వృద్ధులే కరోనా వైరస్ బారిన పడుతున్నారని అంతా అనుకున్నారు. కానీ యువతకు కూడా ఈ వైరస్ ఎక్కువగా సోకుతోందని మొన్న తేల్చారు.  ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. చిన్నారులు కూడా కరోనా వైరస్ బారిన పడుతున్నారని తేలింది. ఇటీవలే తెలంగాణలో పలువురు  చిన్నారులకు కరోనా వైరస్ సోకిన విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో 20 మంది చిన్నారులకు వైద్య చికిత్స కొనసాగుతోంది.  వారంతా 12 ఏళ్లలోపువారే. కరోనా సోకిన పిల్లల్లో 23 రోజుల పసికందు కూడా ఉండటం ఆందోళనకు గురి చేసింది.

తెలంగాణలో 20మంది, ఏపీలో 40మంది పిల్లలకు కరోనా:
తెలంగాణలో పిల్లలకు కూడా కరోనా సోకిందన్న ఆందోళనకర వార్త వెలుగులోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఏపీలోనూ ఇలాంటి వార్త వెలుగు చూసింది. ఏపీలోనూ చిన్న పిల్లలు కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో 40మంది చిన్నారులు కరోనాతో బాధపడుతున్నారు. వీరిలో మూడేళ్ల చిన్నారి నుంచి 17ఏళ్ల వయసున్న పిల్లలు ఉన్నారు. వారి కుటుంబసభ్యుల నుంచి పిల్లలకు కరోనా సోకినట్టు అధికారులు గుర్తించారు. వీరంతా ఢిల్లీ జమాత్ సదస్సుకి హాజరైన వచ్చిన వ్యక్తుల పిల్లలే అని తేలింది.

మర్కజ్ నుంచి వచ్చిన వారి కారణంగా పిల్లలకు కరోనా:
తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది చిన్నారులు కరోనా వైరస్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగానే ఈ చిన్నారులందరికీ  కరోనా సోకింది. మర్కజ్ వెళ్లొచ్చిన వ్యక్తుల నిర్లక్ష్యం కారణంగా వారి కుటుంబసభ్యులతో పాటు ఇంట్లో చిన్నారులకు కూడా కరోనా సోకింది. ప్రభుత్వాలు  పదే పదే చెబుతున్నా కొంతమంది బేఖాతరలు చేస్తున్నారు. పరీక్షలు నిర్వహించుకోకుండా ఇళ్లలోనే ఉండిపోతున్నారు. తమతో పాటు కుటుంబసభ్యులు,  ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు.

ఏపీలో 534కి పెరిగిన కరోనా కేసులు:
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతోంది. గురువారం(ఏప్రిల్ 16,2020) కొత్తగా మరో 9 కేసులు నమోదైనట్లు తాజా బులిటెన్‌‌లో  తెలియజేశారు. వీటిలో కృష్ణా జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. ఈ 9 కేసులతో కలిపి రాష్ట్రంలో  మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 534కు పెరిగింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 20మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి  డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 14మంది చనిపోయారు.

122 కరోనా కేసులతో టాప్ లో గుంటూరు జిల్లా:
రాష్ట్రంలో కరోనా కేసుల్లో గుంటూరు జిల్లా (122) టాప్‌లో ఉంది. మొత్తం 13 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు 11 జిల్లాల్లో నమోదుకాగా.. శ్రీకాకుళం,  విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. నమోదైన కేసుల్లో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఎక్కువమంది ఉన్నారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు:
గుంటూరు జిల్లా -122
కర్నూలు జిల్లా – 113
నెల్లూరు జిల్లా – 58
కృష్ణా జిల్లా -48
ప్రకాశం జిల్లా – 42
కడప జిల్లా – 36
పశ్చిమ గోదావరి జిల్లా – 34
చిత్తూరు జిల్లా – 23
విశాఖపట్నం జిల్లా -20
తూర్పుగోదావరి జిల్లా – 17
అనంతపురం జిల్లా -21
మొత్తం కేసులు -534