విజయవాడలో 62 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సీజ్

విజయవాడలో 62 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సీజ్ అయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులను ఆర్టీఏ సీజ్ చేసింది.

  • Published By: veegamteam ,Published On : January 7, 2020 / 06:02 AM IST
విజయవాడలో 62 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సీజ్

విజయవాడలో 62 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సీజ్ అయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులను ఆర్టీఏ సీజ్ చేసింది.

విజయవాడలో 62 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సీజ్ అయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులను ఆర్టీఏ సీజ్ చేసింది. సంక్రాంతి సీజన్ ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్లు రేట్లను పెంచారు. దీంతో ఆర్టీఏ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేట్ బస్సులను సీజ్ చేశారు. ఏపీలో ప్రైవేట్ బస్సులు నడుపుతున్న యాజమాన్యాలకు రవాణశాఖ మంత్రి పేర్ని నాని వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతు చూస్తామని, తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ప్రైవేట్ బస్ ఆపరేటర్ల దోపిడీకి అడ్డుకట్ట వేస్తామన్నారు. ప్రైవేట్ బస్ ఆపరేటర్లకు ఆర్టీసీ తడాఖా ఏంటో చూపిస్తామన్నారు. నేను కానీ ఒక ఈల వేశానంటే.. ప్రైవేట్ బస్సులన్నీ ఇంటికే అని మంత్రి వార్నింగ్ ఇచ్చారు.

బుధవారం(జనవరి 1, 2020) విజయవాడలో పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఆర్టీసీ ఉద్యోగులు.. సీఎం జగన్ కు విలీన కతృజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలను హెచ్చరించారు. సంకాంత్రి పండక్కి ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల రేట్లకు సమానంగా.. ప్రైవేట్ బస్సుల్లోనూ టికెట్ల ధరలు ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. ఏమాత్రం టికెట్ల రేట్లలో తేడా వచ్చినా.. అధిక చార్జీలు వసూలు చేసినా.. ఊరుకునేది లేదన్నారు.

ఏపీ బోర్డర్ కు వస్తే సంగతి చూస్తామన్నారు. సరిపడ ఆర్టీసీ బస్సులు వేయలేని పేదరికంలో ఉన్నామని, అప్పుల బాధల్లో ఉన్నామని.. అందుకే చూస్తా ఊరుకున్నామని మంత్రి చెప్పారు. రానున్న రెండు, మూడు ఏళ్లలో.. ఆర్టీసీ అప్పులన్నీ తీరాక, కార్మికులకు బకాయిలు చెల్లించాక, బ్యాంకు అప్పులు తీర్చాక.. ప్రైవేట్ బస్సు ఆపరేటర్లకు ఆర్టీసీ తడాఖా ఏంటో చూపిస్తామన్నారు.

ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. సంక్రాంతికి ఛార్జీలు పెంచినా, నిబంధనలు ఉల్లంఘించి బస్సులు నడిపిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.