ప్లాస్మా దానం చేసిన 67 మంది పోలీసులు..ఈ కరోనా వారియర్స్ మా హీరోలు అంటూ సీఎం ప్రశంసలు

  • Published By: nagamani ,Published On : August 2, 2020 / 10:59 AM IST
ప్లాస్మా దానం చేసిన 67 మంది పోలీసులు..ఈ కరోనా వారియర్స్ మా హీరోలు అంటూ సీఎం ప్రశంసలు

కరోనా నుంచి కోలుకున్న 67 మంది అసోం పోలీసులు గౌహతి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (జీఎంసీహెచ్) లో పోలీసు సిబ్బంది తమ ప్లాస్మాను దానం చేశారు. దేశవ్యాప్తంగా కరోనా నియంత్రణ కోసం రాత్రీ పగలూ డ్యూటీలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తు..అహర్నిశలు పోరాడుతున్న పోలీసులు ఆ మహమ్మారి బారిన పడుతున్నారు. అలా కరోనా బారిన పడి కోలుకున్న పోలీసులు మరికొంతమంది కరోనా బాధితులు తమలాగనే కోలుకోవాలనే మంచి మనస్సుతో ప్లాస్మా దానం చేసిన కరోనా వారియర్స్ గా మారుతున్నారు. అలా అస్సాంలో శనివారం (ఆగస్టు 1,2020)న 67మంది పోలీసులు ప్లాస్మా దానం చేశారు.



ప్లాస్మా దానం చేసిన పోలీసులను అస్సాం ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ వారిని సత్కరించారు. సీఎం సర్బానంద సోనోవాల్‌ ప్లాస్మా దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మానవాళికి సేవ చేసేందుకు ప్లాస్మా దానం చేయమని’ ప్రజలకు ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రజల మద్దతు, కరోనా వారియర్స్‌ ధైర్యంతో కొవిడ్‌-19కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మేం చాలా బాగా పని చేస్తున్నాం..మా పోలీసు యంత్రాంగం అంకిత భావంతోపనిచేస్తున్నారని ప్రశంసించారు.

అస్సాం పోలీసుల సాహసోపేతమైన..నిస్వార్థమైన సేవలందిస్తున్న కరోనా వారియర్స్‌ను నేను అభినందిస్తున్నాను.. వారి సేవ విధి పిలుపునకు మించింది.. వారు మా హీరోలు’ అంటూ ట్వీట్‌ చేశారు. అలాగే ప్లాస్మా దానం చేసిన సిబ్బంది పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ భాస్కర్‌ జ్యోతి మహంత అభినందించారు.


అస్సాంలో ఇప్పటి వరకు 1,552 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ రాగా, ఇందులో 1,086 మంది కోలుకున్నారు. మరో నలుగురు మరణించారు. కోలుకున్న వారిలో 279 మంది తిరిగి విధుల్లో చేశారు.