ఈఎస్ఐ స్కాం : వరంగల్ డిస్పెన్సరీలకు ఏసీబీ పిలుపు

  • Published By: madhu ,Published On : September 30, 2019 / 09:14 AM IST
ఈఎస్ఐ స్కాం : వరంగల్ డిస్పెన్సరీలకు ఏసీబీ పిలుపు

ఈఎస్ఐ మందుల కుంభకోణం మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే డైరెక్టర్‌ దేవికారాణిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆమెతో ఈ కేసులో ప్రమేయమున్న ఏడుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పాత ఇండెంట్లను కలర్‌ జిరాక్స్‌ తీసిన నిందితులు… అంకెలు పెంచి కొత్త ఇండెంట్లు తయారు చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. కాగా.. అయితే..వరంగల్ పరిధి 14 డిస్పెన్సరీలకు ఏసీబీ నుంచి పిలుపు వచ్చింది. 2015-2018 కాలంలో మందుల కొనుగోళ్లపై ఏసీబీ ఆరా తీసింది.

దీంతో సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం ఏసీబీ ఎదుట వరంగల్ పరిధి డిస్పెన్సరీ బాధ్యులు హాజరయ్యారు. డిస్పెన్సరీలు, ల్యాబ్ లకు సరఫరా అయిన డ్రగ్ వివరాలు కోరారు ఏసీబీ అధికారులు. ప్రైస్ వివరాలపై సమాచారం లేదని చెప్పడంతో వాటికి సంబంధించిన వివరాలను ఏసీబీ అధికారులు ముందు పెట్టారు. మందుల సరఫరాపై ఇండెట్లు ఇవ్వాలని సూచించగా…దీనికి మించి డిస్పెన్సర్సీలకు మందులను సరఫరా చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మందులను ఏం చేయాలో అర్థంకాక భూమిలో పాతిపెట్టినట్లు తెలుస్తోంది. 

జెడీ పద్మ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కింది స్థాయి సిబ్బంది, ఫార్మసిస్టులపై ఒత్తిడి పెట్టినట్లు తెలుస్తోంది. ఓకే ఇండెంట్‌పై అనేక సార్లు మందుల కొనుగోలు చేసినట్లు..ఇండెట్లపై కింది స్థాయి సిబ్బంది సంతకాలు ముందుగానే దేవికారాణి, పద్మ సేకరించినట్లు నిర్ధారించారు. త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లలో కింది స్థాయి సిబ్బందికి విందులు, వినోదాలు సూత్రధారులు ఇచ్చారని సమచారం. డిస్పెన్సరీలు, ల్యాబ్‌ల సిబ్బందిని మేనేజ్ చేయడానికి సూత్రధారులు అడ్డదారులు తొక్కారు. ఇంకా ఎలాంటి సంచలన విషయాలు వెలుగు చూస్తాయో చూడాలి. 
Read More : పండగ చేస్కోండి : మెట్రో రైల్లో టికెట్లపై 50 శాతం డిస్కౌంట్