వేసవి రద్దీ కోసం 10 ప్రత్యేక రైళ్లు

  • Published By: veegamteam ,Published On : May 8, 2019 / 03:42 AM IST
వేసవి రద్దీ కోసం 10 ప్రత్యేక రైళ్లు

సమ్మర్ హాలిడేస్ కావడంతో అంతా జర్నీ బాట పట్టారు. పిల్లలకు సెలవులు రావడంతో సరదాగా గడిపేందుకు పేరెంట్స్ టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రయాణాలకు అంతా రైళ్లనే సెలెక్ట్  చేసుకుంటున్నారు. దీంతో వేసవిలో అనూహ్యంగా రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఉన్న రైళ్లు సరిపోవడం లేదు. వేసవిలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. అదనంగా 10 రైళ్లు అందుబాటులోకి తెచ్చింది. మే 9వ తేదీ నుంచి మే 13వ తేదీ వరకు అదనపు రైళ్లు నడపనున్నారు.

* వేసవి రద్దీ కారణంగా 10 ప్రత్యేక రైళ్లు
* మే 9 నుంచి మే 13వ తేదీ వరకు అందుబాటులో
* సికింద్రాబాద్ – కాకినాడ మధ్య 6 రైళ్లు
* కాకినాడ – తిరుపతి మధ్య 2 రైళ్లు
* విజయవాడ – తిరుపతి మధ్య ఒక రైలు
* కాకినాడ – సికింద్రాబాద్ మధ్య ఒక రైలు