తెలంగాణలోనే తొలి స్టూడెంట్ : చైనా ఇంటర్న్ షిప్ సాధించిన కూలీ కూతురు

కుమారమ్ భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ లోని నవోదయ విద్యాలయంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది మమత. తండ్రి పోచన్న. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలో నివసించే పొచన్న.. రోజువారీ కూలీ. 

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 06:49 AM IST
తెలంగాణలోనే తొలి స్టూడెంట్ : చైనా ఇంటర్న్ షిప్ సాధించిన కూలీ కూతురు

కుమారమ్ భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ లోని నవోదయ విద్యాలయంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది మమత. తండ్రి పోచన్న. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలో నివసించే పొచన్న.. రోజువారీ కూలీ. 

తెలంగాణ విద్యార్థిని అరుదైన ఘనతను సాధించింది. ఆదిలాబాద్ లోని ఉట్నూర్ మహిళా గిరిజన రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ లో చదివే ఆకుల మమత చైనా ఇంటర్న్ షిప్ కు అర్హత సాధించింది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫర్ ఎగ్జిక్యూషన్ అండ్ కామర్స్ (ALESEC) – గ్లోబల్ NGO సాయంతో ఈ అవకాశాన్ని మమత అందిపుచ్చుకుంది. స్టూడెంట్ డెవలప్ మెంట్ పరిశోధన చేయాలనే పట్టుదల ఉన్న విద్యార్థులకు.. విదేశాలకు వెళ్లే అవకాశాన్ని అందిస్తుంది ఈ సంస్థ. 

పేద విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనేది ఈ సంస్థ ఉద్దేశం. అందులో భాగంగా మెరిట్ స్టూడెంట్స్ కోసం ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉంటుంది. అలా ఎగ్జామ్ రాసి.. మంచి స్కోర్ సాధించిన మమత.. చైనా ఇంటర్న్ షిప్ కు అర్హత సాధించింది. బీఎస్సీ స్టూడెంట్ అయిన మమత… ఫస్ట్ సెమిస్టర్ లో 9.07 గ్రేడ్ పాయింట్లు (GPA) సాధించింది. ఈ అర్హత సాధించిన మొదటి విద్యార్థిని ఆకుల మమత కావటం విశేషం. జూలై నుంచి ప్రారంభమయ్యే ఇంటర్న్ షిప్ ఆరు వారాలు ఉంటుంది. వారు నిర్ణయించిన యూనివర్సిటీల్లో ఈ ప్రోగ్రాం ఉంటుంది.

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ లోని నవోదయ విద్యాలయంలో మమత ఇంటర్ పూర్తి చేసింది. తండ్రి పోచన్న నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం వాసి. పోచన్న రోజువారీ కూలీ. తనను ఇంతగా ప్రోత్సహించిన తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సెక్రటర్రీ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కు మమత కృతజ్ఞత తెలిపింది. తనను ఈ దిశగా ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు, ప్రిన్సిపల్ కు ధన్యవాదాలు తెలిపింది.