జల్లెడ పడుతున్నారు : కారులో ఆరుగురు కుర్రోళ్లు, సాగర్ కాల్వలో గల్లంతు

నాగార్జున సాగర్‌ ఎడమ కాలువలో కారుతోపాటు గల్లంతైన ఆరుగురి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎన్ డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

  • Published By: veegamteam ,Published On : October 19, 2019 / 05:05 AM IST
జల్లెడ పడుతున్నారు : కారులో ఆరుగురు కుర్రోళ్లు, సాగర్ కాల్వలో గల్లంతు

నాగార్జున సాగర్‌ ఎడమ కాలువలో కారుతోపాటు గల్లంతైన ఆరుగురి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎన్ డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

నాగార్జున సాగర్‌ ఎడమ కాలువలో కారుతోపాటు గల్లంతైన ఆరుగురి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వారి ఆచూకీ కోసం ఎన్ డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బృందాలుగా ఏర్పడి బోటులతో గాలింపు చర్యలు చేపట్టాయి. సూర్యపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలం చాకిరాల వద్ద వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి నాగార్జున సాగర్‌ ఎడమ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారుతోపాటు ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 

చాకిరాలలో తమ సహోద్యోగి విమలకొండ మహేష్ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఇన్నోవాలో 5, స్కార్పియోలో 6 వ్యక్తులు  ప్రయాణిస్తున్నారు. అదుపుతప్పి నాగార్జున సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన వాహనం స్కార్పియోగా గుర్తించారు. స్కార్పియో కారు నెంబర్ AP 31  BP 338 గా తెలస్తోంది. ఈ ప్రమాదంలో గల్లంతైన వారు హైదరాబాద్‌లోని ఏఎస్ రావు నగర్‌లో ఉన్న అంకుర్ హాస్పిటల్‌లో పనిచేస్తునట్లు తెలుస్తోంది.

కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం మండెలం చాకిరాల సమీపంలో ఘటన జరిగింది. ఘటనా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, కలెక్టర్ అమయ్ కుమార్, ఎస్పీ భాస్కరన్ పరిశీలించారు. గల్లంతైన వారు అబ్దుల్ అజీద్, రాజేష్, జాన్సన్, సంతోష్, నగేష్, పవన్ కుమార్ లుగా తెలుస్తోంది. గజ ఈతగాళ్లతో ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే సాగర్ కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండటం సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోంది.