అలర్ట్ : తిరుమల కొండపైకి ఆ వాహనాలకు నో ఎంట్రీ

  • Published By: chvmurthy ,Published On : August 27, 2019 / 09:39 AM IST
అలర్ట్ : తిరుమల కొండపైకి ఆ వాహనాలకు నో ఎంట్రీ

తిరుమల: మీ సొంత వాహనంలో తిరుమల కొండకు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుందామని బయలు దేరుతున్నారా.. అయితే ఒక్క క్షణం ఆగండి.. ఈ విషయం తెలుసుకోండి.. ఆ తర్వాత ముందుకు వెళ్లాలో లేదో డిసైడ్ చేసుకోండి.. మీ వాహనం 2003కి ముందు నాటిదైతే… మీ వాహనానికి తిరుమల కొండపైకి నో ఎంట్రీ…. అదేంటి అంటారా.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీటీడీ మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 2003కి ముందు తయారైన కాలం చెల్లిన వాహనాలను నిన్నటి నుంచి (ఆగస్టు 26, 2019) కొండపైకి అనుమతించటం లేదు. వాటిని అలిపిరి ఘాట్ రోడ్డు మొదట్లోనే నిలిపి చెక్ చేసి వెనక్కి పంపిస్తున్నారు విజిలెన్స్ అధికారులు. తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదాలను నివారించే చర్యల్లో భాగంగా కూడా టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.