AP సెక్రటేరియట్‌ టవర్ల నిర్మాణంలో ప్రధాన ఘట్టం

  • Published By: madhu ,Published On : April 18, 2019 / 10:27 AM IST
AP సెక్రటేరియట్‌ టవర్ల నిర్మాణంలో ప్రధాన ఘట్టం

AP రాజధాని అమరావతికి మణిమకుటమైన సెక్రటేరియట్‌ టవర్ల నిర్మాణంలో.. మరో ప్రధాన ఘట్టం ప్రారంభమైంది. జీఏడీ, 3వ నంబర్‌ టవర్లకు కాలమ్స్‌ అమరిక పనులు మొదలుపెట్టారు.  ప్రపంచ ప్రఖ్యాత సంస్థల నిపుణుల ఆధ్వర్యంలో.. ముందు ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ నిర్మించారు. ఇప్పడు భారీ కాలమ్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 5 టవర్లలో రెండింటికి సంబంధించిన భారీ డయాగ్రిడ్‌ కాలమ్స్‌ ఏర్పాటు ప్రారంభించారు. ప్రపంచస్థాయి నిపుణుల పర్యవేక్షలో ఈ పనులు సాగుతున్నాయి. 

అత్యంత నాణ్యమైన స్టీల్‌తో తమిళనాడులో వీటిని తయారు చేసి, అక్కడి నుంచి భారీ వాహనాల్లో అమరావతికి చేర్చారు. జీఏడీ టవర్‌లో ఇలాంటి భారీ కాలమ్స్‌ మొత్తం 512 అమర్చనున్నారు. మొత్తం 5 సెక్రటేరియట్‌ టవర్లలో మూడింటికి సంబంధించిన డయాగ్రిడ్‌ కాలమ్స్‌ అమరికను .. ఎవర్‌సెండాయ్‌ జరపనుండగా, మిగిలిన 2 టవర్లవి జేఎస్‌డబ్ల్యూ సంస్థ చేపట్టనుంది. 
Also Read : హైదరాబాద్‌లో ఈడీ సోదాలు : రూ.82 కోట్ల విలువైన 146కిలోల బంగారం స్వాధీనం

హెచ్‌వోడి, సెక్రెటేరియట్‌ టవర్లలో నాలుగింటిని 40 అంతస్థులు, ఒకదాన్ని 50 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా డయాగ్రిడ్ విధానంలో ఈ భారీ నిర్మాణాలు చేస్తున్నారు. ర్యాప్ట్ ఫౌండేషన్ మీద వీటిని అమర్చుతున్నారు. స్ట్రక్చరల్ స్టీల్ ఫ్యాబ్రికేషన్‌లో ప్రపంచంలోని అగ్రమామి సంస్థల్లో ఒకటైన ఎవర్ సెండాడ్ సంస్థ .. ఈ పనులను చేపట్టింది. దుబయ్‌కు చెందిన ఈ సంస్థకు ..బూర్జ్ ఖలీఫా, మలేషియాలోని పెట్రో నాస్ టవర్ 2, ఖతర్‌లోని ఖలీఫా ఒలింపియాడ్ స్టేడియం, సింగపూర్‌లోని రిపబ్లిక్ ప్లాజా, సౌదీలోని కింగ్ డమ్ సెంటర్ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణాలను చేసిన అనుభవం ఈ సంస్థకు ఉంది.

ఈ భవనాల నిర్మాణంలో 17.80 టన్నుల బరువున్న కాలమ్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఇ350 బిఆర్ గ్రేడ్ అనే అత్యంత నాణ్యిమైన స్టీల్‌తో తయారు చేసి అమర్చుతున్నారు. తమిళనాడులోని తిరుచురాపల్లిలో వెయ్యి టన్నుల బరువైన ఈ కాలమ్స్‌ను సిద్ధం చేస్తున్నారు. అక్కడ్నుంచి రోజూ వీటిని అమరావతి తరలిస్తున్నారు.
Also Read : మే.. లోనే లాంచ్ : శాంసంగ్ నుంచి మడతబెట్టే ఫోన్