పురిటినొప్పులతో అంబులెన్స్ కోసం గర్భిణి ఎదురుచూపులు..రోడ్డు పక్కనే ప్రసవం  

  • Published By: veegamteam ,Published On : December 24, 2019 / 07:00 AM IST
పురిటినొప్పులతో అంబులెన్స్ కోసం గర్భిణి ఎదురుచూపులు..రోడ్డు పక్కనే ప్రసవం  

ప్రసవ వేదనతో అంబులెన్స్ కోసం గర్భిణి ఎదురుచూపులు చూడాల్సిన దుస్థితి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆళ్లపల్లిలో  చోటుచేసుకుంది. ఓ పక్క పురిటి నొప్పులు..మరోపక్క 108 కోసం ఎదురు చూపులు చూస్తున్న గర్భిణి శిరీష పరిస్థితి కడు వేదనగా మారింది. 108కు ఫోన్ చేసిన రాకపోవటంతో తీవ్రమైన ప్రసవ వేదనతో శిరీష్ రోడ్డు పక్కనే బిడ్డను ప్రసవించింది. పురిటి నొప్పులు క్షణ క్షణానికి పెరుగుతున్నా అంబులెన్స్ జాడ లేదు. ఈ క్రమంలో పురిటి నొప్పులు అంతకంతకూడా పెరిగాయి. దీంతో శిరీష మగబిడ్డకు జన్మనిచ్చింది.   

కొత్తగూడెం టేకులపల్లి సుభా నగర్ నుంచి గూండాల మీదుగా ఆళ్లపల్లి రావాల్సిన అంబులెన్స్ సకాలంలో రాకపోవటంతో పురిటి నొప్పులు ఎక్కువ కావటంతో శిరీష రోడ్డు పక్కనే ప్రసవించాల్సి వచ్చింది. శిరీష ప్రసవంలో ఏఎన్ ఎంగా పనిచేస్తున్న సుజాత చాకచక్యంగా వ్యవహరించటంతో శిరీషకు ఎటువంటి ప్రమాదం జరగకుండా..ప్రసవిం జరిగింది. అనంతరం శిరీషకు..బిడ్డకు మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం హాస్పిటల్ కు తరలించారు. దీంతో తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. 

ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నా..ప్రభుత్వ పథకాలు అడవిబిడ్డలకు మాత్రం చేరటంలేదు అనటానికి రోడ్డు పక్కనే ప్రసవించిన శిరీష ఘనట ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రజలకు మెరుగైన వైద్య సేవల్ని అందించేందుకు ప్రభుత్వం 108 వాహనాలకు అమలు చేస్తోంది. కానీ అంబులెన్స్ కు కూడా చేరుకోలేని ఎన్నో గ్రామాలు తెలంగాణలో ఉన్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియావాసులకు ఈ 108 వాహనాల సౌకర్యాన్ని అందుకోలేకపోతున్నారు. దీంతో పలు సందర్భాలలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా జరగుతున్నాయి.