బీజేపీ బస్సు యాత్ర : ఏపీకి అమిత్ షా

  • Published By: madhu ,Published On : February 4, 2019 / 04:47 AM IST
బీజేపీ బస్సు యాత్ర : ఏపీకి అమిత్ షా

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కమలనాథుల దళం ప్రత్యేక నజర్ పెట్టింది. ఇక్కడ పాగా వేయాలని బీజేపీ అధిష్టానం వ్యూహలు రచిస్తోంది. లోక్ సభ ఎన్నికలు, ఏపీలో త్వరలో  ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో బీజేపీ అలర్ట్ అయ్యింది. ఏపీలో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కాషాయ గ్రూప్ ఇంటింటికి బీజేపీ నిర్వహిస్తోంది. కార్యక్రమాలు నిర్వహిస్తూనే టీడీపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. 

తాజాగా ఏపీ బీజేపీ బస్సు యాత్ర చేపడుతోంది. ఈ బస్సు యాత్రను స్టార్ట్ చేయడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. ఫిబ్రవరి 04వ తేదీ సోమవారం నుండి 15 రోజుల పాటు బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు ఆ పార్టీ ప్లాన్ చేసింది. శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రారంభమయ్యే ఈ యాత్ర కర్నూలు జిల్లా ఆదోనిలో ముగుస్తుంది. కేంద్రం ఏపీకి ఏం ఇచ్చింది..? ఎన్ని నిధులు కేటాయించింది..వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేసిందనే విషయాలపై ప్రజలకు వివరించనున్నారు. 

షా షెడ్యూల్ 

  • ఉదయం 10.30గంటలకు అమిత్ షా విశాఖపట్నం ఎయిర్‌పోర్డుకు రాక. 
  • విజయనగరంలో జరిగే శక్తి కేంద్ర ప్రముక్‌ కార్యక్రమంలో షా పాల్గొంటారు. 
  • మధ్యాహ్నాం 2 గంటలకు శ్రీకాకుళం జిల్లా పలాస చేరుకుంటారు. 
  • బస్సు యాత్రను ప్రారంభించి… బహిరంగ సభలో ప్రసంగం.