బీరు తాగిన బాలింత‌..ప‌సికందు మృతి: తల్లికి 20ఏళ్ల జైలుశిక్ష..!! ఆ తరువాత…

  • Published By: nagamani ,Published On : July 31, 2020 / 12:27 PM IST
బీరు తాగిన బాలింత‌..ప‌సికందు మృతి: తల్లికి 20ఏళ్ల  జైలుశిక్ష..!! ఆ తరువాత…

బిడ్డకు జన్మనివ్వటం మహిళకు పునర్జన్మతో సమానం. బిడ్డ పుట్టిన తరువాత తన ఆరోగ్యంతో పాటు బిడ్డ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చక్కటి ఆహారం తీసుకోవాలి. అది తల్లి బాధ్యత. ఆ సమయంలో బాలింత శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. బిడ్డలకు కూడా అంతే. దీంతో ఆ తల్లికి ఏమన్నా చెడు అలవాట్లు అంటే మద్యం తాగటం..పొగతాగటం వంటి అలవాట్లు ఉంటే వాటికి దూరంగా ఉండాలి. అలా చేయకపోతే బిడ్డ ప్రాణాలకు చాలా ప్రమాదం..ఒక్కోసారి బిడ్డ ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి ఘటన జరిగింది అమెరికాలో. బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి బాధ్యత లేకుండా బీరు తాగటంతో ఆ పసికందు ప్రాణాలే పోయిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.



వివరాల్లోకి వెళితే…అమెరికాలోని మేరీల్యాండ్ కు చెందిన మురియెల్ మోరిస‌న్ అనే మ‌హిళ బిడ్డను ప్రసవించింది. అప్పటికే నాలుగు సంవత్సరాలు ఉన్న పసివాడు ఉన్నాడు మరియోల్ కు . తరువాత రెండో బిడ్డను ప్రసవించింది. పసికందుకు రెండునెలలు వచ్చాయి. పెద్ద బిడ్డను పడుకోబెట్టింది. ఆ తరువాత ఆమె ఫుల్లుగా బీరు తాగింది. తరువాత పిల్లలిద్దరికీ డైప‌ర్లు మార్చి..పసిబిడ్డకు పాలు ఇచ్చింది. అమ్మ దగ్గర పాలు తాగిన పసిబిడ్డ కూడా హాయిగా నిద్రపోయింది. తరువాత మరియోల్ కూడా ప‌డుకుంది. తెల్లారి లేచి చూసేస‌రికి రెండు నెల‌ల పసిబిడ్డ మంచంమీద చనిపోయి ఉంది.



దీంతో బిడ్డ వెంటనే హాస్పిటల్ కు తరలించారు. పసిబిడ్డ పెదవులు నీలం రంగులో ఉండటంతోఅనుమానించిన డాక్టర్లు బ్లడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేయగా.. బిడ్డ రక్తంలో మద్యం ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. బిడ్డను పట్టించకోకుండా నిర్లక్ష్యం చేసిన తల్లిపై నేరం చేసినట్లుగా కేసు నమోదైంది. ఆ కేసు కోర్టుకెళ్లింది. 2013లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న కోర్టు దాకా వెళ్ల‌డంతో ప్ర‌త్యేక న్యాయ‌స్థానం స‌ద‌రు మ‌హిళ‌ను దోషిగా తేలుస్తూ..20 ఏండ్ల జైలుశిక్ష విధించింది.



ఈ తీర్పును స‌వాల్ చేస్తూ స‌ద‌రు మ‌హిళ పైకోర్టుకు అప్పీల్ చేసింది. ప్రస్తుతం ఆ అప్పీల్‌పై విచార‌ణ జ‌రిపిన మేరీల్యాండ్ ఉన్న‌త న్యాయ‌స్థానం.. స‌ద‌రు మ‌హిళ‌ను నిర్దోషిగా తేల్చింది. మ‌ద్యం సేవించి బిడ్డ‌తో క‌లిసి నిద్రించ‌డం అనేది నేరం కాద‌ని పేర్కొంటూ..న్యాయమూర్తులు మిచెల్ డి. హాటెన్, చీఫ్ జడ్జి మేరీ ఎల్లెన్ బార్బెరా, షిర్లీ ఎం. వాట్స్, బ్రైన్జా M. బూత్ ధర్మాసనం తీర్పునిస్తూ..కింది కోర్టు విధించిన 20 ఏళ్ల జైలుశిక్ష‌ను ర‌ద్దుచేసింది.