పవర్ & పొలిటిక్స్ : ఏపీ సర్కార్ వరాలు

  • Published By: madhu ,Published On : January 14, 2019 / 12:43 PM IST
పవర్ & పొలిటిక్స్ : ఏపీ సర్కార్ వరాలు

విజయవాడ : ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రజలను ఆకట్టుకొనేందుకు…మరోసారి అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది. ఫిబ్రవరి నెలాఖరు…మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ సర్కార్ అప్పుడే వరాలు ప్రకటిస్తోంది. వీలైనన్ని సంక్షేమ పథకాలు ప్రకటించేసి విపక్షాలను ఇరకాటంలో పెట్టాలని టీడీపీ ప్లాన్స్ వేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ధీటుగా వరాలు కురిపించాలని బాబు అనుకుంటున్నారు. 
మొన్ననే వెయ్యి రూపాయల ఫించన్‌ను రూ. 2వేలు పెంచుతున్నట్లు బాబు ప్రకటించారు. ఇది ఆల్ రెడీ తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ జరుగుతున్నవి బాబు కాపీ కొడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. సేద్యానికి ఇక ఉచితంగా 9గంటల విద్యుత్…చంద్రన్న పెళ్లి కానుక పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. భోజనం పెట్టి చంద్రన్న పెళ్లి కానుక, పెంచిన ఫించన్ పంపిణీ చేయాలని బాబు యోచిస్తున్నారు. గ్రామగ్రామాన ఓ పండుగలా నిర్వహించాలని బాబు దిశానిర్దేశం చేస్తున్నారు. రానున్న కాలంలో ఇంకా బాబు ఎలాంటి వరాలు కురిపిస్తారో చూడాలి. సో….ఈ  వరాలతో ఓట్లు రాలుతాయా ? లేదా ? అనేది  ఎన్నికల వరకు వేచి ఉండాల్సిందే.