ఏప్రిల్ 12న ఇంటర్ ఫలితాలు విడుదల!

  • Published By: vamsi ,Published On : April 3, 2019 / 12:59 AM IST
ఏప్రిల్ 12న ఇంటర్ ఫలితాలు విడుదల!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల విడుదలకు విద్యాశాఖ సర్వం సిద్దం చేస్తుంది. ఇప్పటికే కరెక్షన్ ప్రక్రియ దాదాపు జిల్లాల్లో పూర్తి కావడంతో సమాధాన పత్రాలను కరెక్షన్ చేసే టీచర్లను కూడా ఎన్నికల విధులకు అటాచ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఫలితాలు ముందే రెడీ అయినప్పటికీ ఎలక్షన్ తర్వాతి రోజైన  ఏప్రిల్ 12వ తేదీ నాడే విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరిక్షలకు ఫస్టియర్‌, సెకండియర్‌ కలిపి 10 లక్షల మందికి పైగా హాజరయ్యారు.