3 రాజధానుల వ్యవహారం మరో మలుపు 

పరిపాలనా వికేంద్రీకరణ, CRDA బిల్లులను సెలక్ట్ కమిటీకి శాసన మండలి పంపడంతో.. మూడు రాజధానుల వ్యవహారం మరో మలుపు తిరిగింది.

  • Published By: veegamteam ,Published On : January 22, 2020 / 07:09 PM IST
3 రాజధానుల వ్యవహారం మరో మలుపు 

పరిపాలనా వికేంద్రీకరణ, CRDA బిల్లులను సెలక్ట్ కమిటీకి శాసన మండలి పంపడంతో.. మూడు రాజధానుల వ్యవహారం మరో మలుపు తిరిగింది.

పరిపాలనా వికేంద్రీకరణ, CRDA బిల్లులను సెలక్ట్ కమిటీకి శాసన మండలి పంపడంతో.. మూడు రాజధానుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. సెలక్ట్ కమిటీ దీనిపై ఎంతకాలంలో తేల్చుతుందన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. సెలక్ట్ కమిటీ అంటే ఒక రకంగా కౌన్సిల్ సబ్ కమిటీ. కౌన్సిల్‌లో మొత్తం 58 మంది ఎమ్మెల్సీలు ఉంటారు.

ఒక అంశాన్ని 58 మంది అధ్యయనం చేయలేరు కనుక కౌన్సిల్ ఒక సెలక్ట్ కమిటీని నియమిస్తుంది. ఈ కమిటీలో అన్ని పార్టీలకు చెందిన సభ్యులూ ఉంటారు. మండలిలో ఆమోదం పొందని అంశాన్ని కమిటీ మరింత లోతుగా అధ్యయనం చేస్తుంది. అనంతరం తిరిగి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ తిరిగి శాసన మండలికి వస్తుంది. 

సెలక్ట్ కమిటీతో ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయలేరు. రూల్ నెంబర్ 187 ప్రకారం కౌన్సిల్ చేయగలిగింది ఏమీ లేదు. కేవలం ఒక నిర్ణయాన్ని ఆలస్యం చేయగలదు తప్ప ఆపలేదు. సెలక్ట్ కమిటీ కేవలం కొంత ఆలస్యం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మూడు రాజధానుల బిల్లు వెంటనే ఆమోదం పొంది, రాజధానులు అమల్లోకి రాకుండా ఈ సెలక్ట్ కమిటీ ఆపగలుగుతుంది. అయితే చివరకు అసెంబ్లీదే ఫైనల్ నిర్ణయం అవుతుంది. 

పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉన్న చాలా దేశాల్లో సెలక్ట్ కమిటీలు ఉన్నాయి. శాసనసభ, శాసనమండలి ఒక అంశాన్ని, ఒక చట్టాన్ని మరింత లోతుగా అధ్యయం చేయాలని భావిస్తే సెలక్ట్ కమిటీని నియమిస్తారు. బిల్లులును ఆపే అధికారం శాసనమండలికి లేదు. అధ్యయనం వెంటనే చేయమనే హక్కు కూడా లేదు. అయితే.. సెలక్ట్ కమిటీకి బిల్లును పంపించే అధికారం మాత్రం మండలికి ఉంది.

పార్లమెంటులో కూడా అనేక బిల్లులు సెలక్ట్ కమిటీకి పంపారు. మండలిలో ఎక్కువ మంది టీడీపీ నేతలు ఉండటంతో.. సెలక్ట్ కమిటీలో కూడా వారే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక సెలక్ట్ కమిటీ చేసిన సూచనలను కూడా  ప్రభుత్వం పాటించాల్సిన పనిలేదు. కాకపోతే.. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయం మాత్రం వెంటనే అమలు కాకుండా మండలి చైర్మన్‌ తీసుకున్న నిర్ణయం అడ్డుపడుతుంది.