కూతురు పేరును ప్రకటించిన కోహ్లీ, అనుష్క

10TV Telugu News

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తమ కుమార్తె పేరును ప్రకటించారు. అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ద్వారా కుమార్తెకు పేరు పెట్టినట్లు వెల్లడించారు. కోహ్లీ, అనుష్కలు తమ కుమార్తెకు ‘వామికా’ అని పేరు పెట్టినట్లుగా ఇన్‌స్టాగ్రమ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. వామిక అంటే దుర్గా మాత మరోపేరుగా చెబుతున్నారు. విరాట్ కోహ్లీ, అనుష్క జనవరిలో తల్లిదండ్రులు అవ్వగా ఇప్పుడు వారి కుమార్తెకు పేరు పెట్టారు.

విరాట్ మరియు ఆమె కుమార్తెతో కలిసి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన అనుష్క శర్మ, “మేము ప్రేమలో కలిసి ఉన్నాము, మా ప్రేమ మరియు విశ్వాసం ‘వామికా’ రాకతో సరికొత్త స్థాయికి తీసుకువెళ్ళింది. కన్నీళ్లు, నవ్వు, ఆందోళన, ఆనందం.. కొన్ని నిమిషాల వ్యవధిలో అనుభవించిన భావోద్వేగాలు.. మీ కోరికలు, ప్రార్థనలు మంచి శక్తిని ఇచ్చాయి. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని వారు తెలిపారు.

కుమార్తె పుట్టడం వల్ల ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడిన విరాట్ భారత్‌కు తిరిగి వచ్చేశాడు. అప్పటి నుంచి ఫ్యామిలీతోనే ఎక్కువగా టైమ్ గడుపుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

10TV Telugu News