ఏపీ లో 3 జిల్లాల్లో మార్చి 31 వరకు లాక్ డౌన్ : కేంద్రం ఆదేశాలు

  • Published By: chvmurthy ,Published On : March 22, 2020 / 12:03 PM IST
ఏపీ లో 3 జిల్లాల్లో మార్చి 31 వరకు లాక్ డౌన్ : కేంద్రం ఆదేశాలు

దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్ కట్టడికి కేంద్ర కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.  కోరనా విస్తరిస్తున్నజిల్లాల్లో  ఆంక్షలు విధిస్తోంది. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే  మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించగా మరికొన్ని రాష్ట్రాలు ఆబాటలోనే పయనించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని 3 జిల్లాల్లో మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించాలకి కేంద్ర ప్రభుత్వం  రాష్ట్ర  ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 75 జిల్లాల్లో కరోనా నిర్భంధం కొనసాగుతోంది. విశాఖ, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించాలని కేంద్ర ఆదేశించింది. 

ఈ జిల్లాల నుంచే కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో ప్రత్యేకించి ఈ జిల్లాలోని వారిని ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా కర్ఫ్యూ విధించింది. కరోనా వైరస్ కట్టడి చేసేందుకు అన్ని రకాల ఆంక్షలను కేంద్రం అమలు చేస్తోంది. మంత్రిత్వ శాఖలవారీగా అందరిని సమన్వయపరుస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కట్టడి చేసే చర్యలను వేగవంతం చేసింది.

ఏపీ కి సరిహద్దు రాష్ట్రమైన తెలంగాణలోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున  అక్కడ 5జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించాలని కేంద్ర ప్రకటించింది.  కేంద్ర కేబినెట్ సెక్రటరీ, ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి, పలు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో జరిగిన వీడియో కాన్ఫిరెన్స్‌లో ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వం  లాక్ డౌన్  ప్రకటించిన 75 జిల్లాల వివరాలు

75 districts lock down

75 districts lock down 2