ఏపీ బడ్జెట్ : కులాసంఘాలకు భారీ కేటాయింపులు

అమరావతి: 2019-20 సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం భారీ అంచనాలతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను 2019, ఫిబ్రవరి 5వ తేదీన మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఎన్నికల వేళ

  • Published By: veegamteam ,Published On : February 5, 2019 / 07:50 AM IST
ఏపీ బడ్జెట్ : కులాసంఘాలకు భారీ కేటాయింపులు

అమరావతి: 2019-20 సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం భారీ అంచనాలతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను 2019, ఫిబ్రవరి 5వ తేదీన మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఎన్నికల వేళ

అమరావతి: 2019-20 సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం భారీ అంచనాలతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను 2019, ఫిబ్రవరి 5వ తేదీన మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఎన్నికల వేళ కావడంతో అన్నివర్గాల ప్రజలపై తాయిలాలు ప్రకటించింది. జనాకర్షంగా బడ్జెట్ రూపొందించింది. భారీగా కేటాయింపులు అనౌన్స్ చేసింది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రూ.5వేల కోట్లతో అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకొచ్చింది. నిరుద్యోగ భృతిని డబుల్ చేసింది. వెయ్యి రూపాయల నుంచి 2వేలకు పెంచింది. అదే విధంగా కులసంఘాల సంక్షేమం కోసం భారీగా నిధులు కేటాయించింది.

 

కులసంఘాలు, కేటాయింపులు:
మైనార్టీల సంక్షేమం కోసం రూ.1,304.43కోట్లు
బీసీ కార్పొరేషన్‌కు రూ.3వేలకోట్లు
కాపుల సంక్షేమం కోసం రూ.వెయ్యి కోట్లు
బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ.100కోట్లు
క్షత్రియుల సంక్షేమం కోసం రూ.50కోట్లు
ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం రూ.50కోట్లు

 

ఏపీ రాజధాని అమరావతి వేదికగా ఆర్థిఖ శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వరుసగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. నాలుగున్నరేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామన్నారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన జరిగిందని విమర్శించారు. దాని వల్ల రాజధాని నగరాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయ-వ్యయాలు, ఆస్తులు, అప్పులు సరిగా పంపిణీ చేయలేదన్నారు. 2019-20 బడ్జెట్‌ అంచనా రూ.2,26,117.53కోట్లు కాగా, గతేడాది కన్నా ఇది 18.38శాతం పెరుగుదల. రెవెన్యూ వ్యయం రూ.1,80,369.33కోట్లు(20.03శాతం పెంపు కాగా, మూలధన వ్యయం రూ.29,596.33కోట్లు, రెవెన్యూ మిగులు రూ.2099.47కోట్లుగా అంచనా వేయగా, ఆర్థికలోటు 32,390.68కోట్లుగా అంచనా వేశారు.