ఏపీ బడ్జెట్ : ఏ రంగానికి ఎంతెంత

  • Publish Date - February 5, 2019 / 05:28 AM IST

అమరావతి: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్నికల వేళ… ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. రూ.2.26లక్షల కోట్లతో బడ్జెట్ పెడతారని, బడ్జెట్ జనాకర్షంగా ఉంటుందని సమాచారం. ఎన్నికల వేల అన్నివర్గాల ప్రజలపై చంద్రబాబు భారీ వరాలు కురిపిస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా రైతాంగం, సంక్షేమం, నీటి పారుదల రంగానికి పెద్ద పెద్ద పీట వేస్తారని చెబుతున్నారు. రైతులకు హెక్టార్‌కు రూ.10 వేల నుంచి రూ.12వేల వరకు పెట్టుబడి సాయం అందిస్తారని సమాచారం. నిరుద్యోగ భృతి రెట్టింపు చేసే (2వేల రూపాయలు) ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇక బడ్జెట్‌లో కేటాయింపుల విషయానికి వస్తే ఇలా ఉన్నాయి.

బడ్జెట్‌లో కేటాయింపులు:
* గ్రామీణాభివృద్ధికి రూ.32వేల కోట్లు కేటాయించే ఛాన్స్
* మానవ వనరుల అభివృద్ధికి రూ.25వేల కోట్లు
* నీటి పారుదల శాఖకు రూ.16వేల కోట్లు
* వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.15వేల కోట్లు    
* విద్యాశాఖకు రూ.25వేల కోట్లు, సంక్షేమానికి రూ.16 వేల కోట్లు
* వైద్య, ఆరోగ్యానికి రూ.10వేల కోట్లు కేటాయించే అవకాశం

ట్రెండింగ్ వార్తలు