ఏపీ బడ్జెట్ : పసుపు-కుంకుమ రూ.4 వేల కోట్లు 

  • Published By: veegamteam ,Published On : February 5, 2019 / 07:56 AM IST
ఏపీ బడ్జెట్ : పసుపు-కుంకుమ రూ.4 వేల కోట్లు 

అమరావతి : ఏపీ అసెంబ్లీలో మంత్రి యనమల బడ్జెట్ ను ప్రకటించారు. దీంట్లో భాగంగా మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపిన మంత్రి మహిళలు అభివృద్ధి చెందనిదే  సమాజ వికాసం ఉండదనీ..కుటుంబ వికాసం సాధించలేమన్నారు. దీంతో మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ఆర్థిక భారాన్ని సైతం లెక్కచేయకుండా పసుపు-కుంకుమ పథకాన్ని ప్రవేశపెట్టిందని యనమల తెలిపారు. ఈ ఫథకం ద్వారా ప్రతి స్వయం సహాయక సంఘ సభ్యురాలికి రూ.10వేల చొప్పున అందజేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా 86,04,304 స్వయం సహాయక సంఘాల సభ్యులకు లబ్ది చేకూర్చేలా ఈ బడ్జెట్లో రూ.4వేలకోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 

డ్వాక్రా, మెప్మా ఆడపడుచుల కోసం ..స్వయం సహాయక సంఘాల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం కృషి చేస్తోందనీ..అందుకే గతంలో ఇచ్చినదానికి అదనంగా మరో రూ.10వేలు ఇవ్వాలనే నిర్ణయంతో ఫిబ్రవరిలో రూ.2,500, మార్చిలో రూ.3,500, ఏప్రిల్‌లో రూ.4,000 ఇస్తామని మంత్రి యనమల అసెంబ్లీ బడ్జెట్ ప్రకటించారు.